మా లాయర్ ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్పారు..నటి హేమ వీడియోపై దారుణంగా ట్రోలింగ్
ఛార్జ్ షీట్ దాఖలు చేయడంపై హేమ తాజాగా తన వివరణ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో హేమ వ్యాఖ్యలు పూర్తి భిన్నంగా ఉన్నాయి.
బెంగళూరు రేవ్ పార్టీ సంఘటనలో నటి హేమ ఆ మధ్య అరెస్ట్ అయి బెయిల్ పై విడుదల అయింది. ఈవివాదం కాస్త సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో హేమకి షాక్ తగిలింది. బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై పోలీసులు తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అందులో నటి హేమ తో పాటు మొత్తం 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. హేమకి ఊహించని షాక్ ఇస్తూ ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.
మొత్తం 1000కి పైగా పేజీలతో పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. హేమ వాడిన డ్రగ్స్ గురించి కూడా పోలీసులు ఛార్జ్ షీట్ లో ప్రస్తావించారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్స్ వాడినట్లు నిర్దారణ అయిందని పేర్కొన్నారు. ఎండీపీఎస్ సెక్షన్ 27 కింద హేమపై పోలీసులు కేసు నమోదు చేశారు. హేమ మాత్రం తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని ఇటీవల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఛార్జ్ షీట్ దాఖలు చేయడంపై హేమ తాజాగా తన వివరణ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో హేమ వ్యాఖ్యలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. నేను ఈ రోజు ఒక గుడ్ న్యూస్ విన్నాను. మా లాయర్ ఫోన్ చేసి చెప్పారు. ఛార్జ్ షీట్ లో నా బ్లడ్, హెయిర్, నెయిల్స్ ఇలా అన్నీ నెగిటివ్ వచ్చినట్లు చెప్పారు అంటూ హేమ వీడియోలో పేర్కొంది.
అఫీషియల్ గా ఛార్జ్ షీట్ లో నాకు నెగిటివ్ వచ్చింది. నేను చేయించుకున్న టెస్టుల్లో కూడా నెగిటివ్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ హేమ వీడియోలో పేర్కొంది. అయితే పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ కి భిన్నంగా హేమ వీడియో రిలీజ్ చేయడంతో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. బెంగుళూరులో ఉండి.. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానని చెప్పావ్.. ఇప్పుడు మళ్ళీ అబద్దాలు చెబుతున్నావ్.. నిన్ను ఎవరూ నమ్మరు అంటూ ట్రోల్ చేస్తున్నారు.