Asianet News TeluguAsianet News Telugu

పోలీసులని ఆశ్రయించిన నటి హేమ, తీవ్ర ఆగ్రహం.. భర్తతో ఉన్న ఫోటోలు అలా, ఏం జరిగిందంటే

టాలీవుడ్ లో నటి హేమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. దశాబ్దాల కాలం నుంచి హేమ టాలీవుడ్ లో కీలకమైన నటిగా రాణిస్తోంది. అక్క, వదిన, అత్త, సవతి తల్లి తరహా పాత్రల్లో హేమ ఎంత అద్భుతంగా పెర్ఫామ్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Actress Hema complaints in CyberCrime against fake news
Author
First Published Mar 22, 2023, 7:28 AM IST

టాలీవుడ్ లో నటి హేమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. దశాబ్దాల కాలం నుంచి హేమ టాలీవుడ్ లో కీలకమైన నటిగా రాణిస్తోంది. అక్క, వదిన, అత్త, సవతి తల్లి తరహా పాత్రల్లో హేమ ఎంత అద్భుతంగా పెర్ఫామ్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి క్యారెక్టర్ రియల్ లైఫ్ లో ఇరుగు పొరుగు ఇళ్లల్లో చూస్తూనే ఉంటాం కదా అనిపించేలా హేమ నటించి మెప్పించగలదు. ఇక హేమ నిత్యం వార్తల్లో నిలవడం కూడా చూస్తూనే ఉన్నాం. 

ఇండస్ట్రీలో ఏం జరిగినా హేమ ముందుండి ఆ కార్యక్రమంలో పాల్గొంటుంది. 90వ దశకంలోనే కెరీర్ ప్రారంభించిన హేమ వందల చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ పోషించింది. అయితే ఏదైనా వివాదం జరిగినప్పుడు, సమస్య ఎదురైనప్పుడు హేమ అంతే బోల్డ్ గా ఉంటుంది. తాజాగా నటి హేమ హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించారు. 

సెలెబ్రెటీలకు, నటీమణులకు తరచుగా సోషల్ మీడియా నుంచి సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. టాలీవుడ్ సెలెబ్రిటీలని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు, యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్లు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు అంటూ హేమ సైబర్ క్రైమ్ పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. 

Actress Hema complaints in CyberCrime against fake news

ఆ అసత్య ప్రచారాలు తమ వ్యక్తిగత జీవితాలని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని హేమ ఆరోపించింది. అలాంటి ఫేక్ న్యూస్ ని అరికట్టాలని, వాళ్లపై తగిన యాక్షన్ తీసుకోవాలని హేమ సైబర్ క్రైమ్ అసిస్టెంట్ కమిషనర్ కెవిఎమ్ ప్రసాద్ ని కోరారు. ఈ మేరకు ఫిర్యాదు అందించారు. 

మూడేళ్ళ క్రితం తన భర్తతో ఉన్న ఫోటోలని బయటకి తీసి చిరాకు పుట్టించే విధంగా థంబ్ నెయిల్స్ తో యూట్యూబ్ ఛానల్స్ దారుణంగా ప్రవర్తిస్తున్నాయి అని హేమ అన్నారు. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావుకి కూడా నిన్న ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది అని హేమ ప్రస్తావించారు. కోట బ్రతికుండగానే చనిపోయినట్లు వార్తలు సృష్టించారు. అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి అని హేమ కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios