మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల ఉత్కంఠ వీడింది. శివాజీరాజా ప్యానెల్, నరేష్ ప్యానెల్ పోటీ పడగా.. నరేష్ ప్రెసిడెంట్ గా అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఇంతకాలం ఈసీ సభ్యుల వరకే పరిమితమైన మహిళలకు ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత పెరిగింది.

నటి జీవిత ప్రధాన కార్యదర్శిగా గెలిచి బాధ్యతలు చేపట్టింది. ఇక హేమ అయితే ఇండిపెండెంట్ అభ్యర్ధినిగా పోటీ చేసి గెలుపొందడం విశేషం. ఉపాధ్యక్ష పదవి కోసం స్వతంత్య్ర అభ్యర్ధినిగా పోటీ చేసిన ఆమె గెలిచిన ఉత్సాహంలో మీడియాతో మాట్లాడారు.

నలుగురు మగాళ్లపై పోటీ చేసి గెలిచినట్లు చెప్పిన ఆమె ఈ గెలుపు పరిశ్రమలో ఆడవాళ్లందరి గెలుపని తెలిపింది. మహిళలే తనకు ఓటు వేసి గెలిపించారని వారందరికీ కృతజ్ఞతలు చెప్పింది.

మూవీ ఆర్టిస్టుల సంఘం పురోభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించింది. సినిమాల పరంగా హేమ బిజీ ఆర్టిస్ట్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఎంతమంది ఉన్నా.. హేమకి మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

 "