డేటింగ్‌ యాప్‌లో వేధిస్తున్నారంటూ సైబర్‌ క్రైమ్‌కి నటి ఫిర్యాదు..

నటి గీతాంజలి సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. తనని కొందరు దుండగులు వేధిస్తున్నారని ఆమె పేర్కొంది. 

actress geethanjali police complaint cyber crime  arj

నటి గీతాంజలి సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. తనని కొందరు దుండగులు వేధిస్తున్నారని ఆమె పేర్కొంది. డేటింగ్‌ యాప్‌లో తనన చిత్రాలను జోడించారని ఆమె నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై  వినయ్‌ కథనం ప్రకారం `గుర్తు తెలియని వ్యక్తులు డేటింగ్‌ యాప్‌లలో తన చిత్రాలను జోడించారని గీతాంజలి ఫిర్యాదు చేశారు. దీంతో తాను తీవ్ర వేధింపులకు గురవుతున్నానని ఆమె పేర్కొన్నట్టు వెల్లడించారు. దీనిపై విచారణ చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు.దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios