ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఎవ్వరిని వదలడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎదో రకంగా కరోనా బారిన పడుతున్నారు. సామాన్యులు , సెలబ్రెటీలు అని తేడాలేకుండా అందరు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇక సెలబ్రెటీలకు కరోనా సోకడం వారి అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. షూటింగ్ లకు ఫర్మిషన్స్ ఇచ్చినప్పటి నుంచీ సినీ పరిశ్రమను కరోనా టార్గెట్ చేసింది. దాంతో  యావత్ సినీ ఇండస్ట్రీ వణికిపోతోంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు, సెలబ్రెటీలకు కరోనా వైరస్ సోకింది. రీసెంట్ గా   ఛార్మి తల్లిదండ్రులిద్దరూ కరోనా బారిన పడ్డారు. ఇదే విషయం తన సోషల్ మీడియా పేజీలో అభిమానులతో షేర్ చేసుకుంది ఛార్మి.

 లాక్‌డౌన్ నుంచి తన పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకున్నారని, కానీ  కరోనా వైరస్ బారినపడ్డట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం తెలిసి తానెంతో బాధపడినట్లు వెల్లడించింది. అక్టోబర్ 22న తన తల్లిదండ్రులకు కొవిడ్ పాజిటివ్​గా తేలినట్లు చార్మి పేర్కొంది. 

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇన్ఫెక్షన్స్ పెరిగిపోయాయని చెప్పింది ఛార్మి. అందుకే తన పేరెంట్స్ కోవిడ్ పాజిటివ్ అయ్యారని చెప్పుకొచ్చింది ఛార్మి. AIG హాస్పిటల్స్‌లో ప్రస్తుతం ఛార్మి తల్లిదండ్రులు చికిత్స తీసుకుంటున్నారు. వాళ్లు ప్రస్తుతం బాగానే ఉన్నట్లు చెప్పింది ఛార్మి. తన తల్లిదండ్రులను త్వరలోనే ఆనందంగా, ఆరోగ్యంగా చూడాలనుకుంటున్నట్లు చెప్పింది. ఎవరైనా సరే సింటమ్స్ కనిపిస్తే వెంటనే టెస్టులు చేయించుకోవాలని, పాజిటివ్ వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని చార్మీ నెటిజన్లను కోరింది.