దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. అదే సమయంలో తాము వ్యాక్సిన్ తీసుకుంటున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం ప్రమాదమనే అపోహలు సామాన్య ప్రజలలో నెలకొన్న తరుణంలో, వారికి అవగాహన కల్పించడం కోసం సెలెబ్రిటీలు ఇలా చేస్తున్నారు. టాలీవుడ్ లో నాగార్జున, మోహన్ బాబు, మంచు లక్ష్మీ వంటి సెలెబ్రిటీలు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. 


అయితే వ్యాక్సిన్ తీసుకొనే సమయంలో కొందరు సెలెబ్రిటీలు చేస్తున్న అతిని విమర్శించారు బాలీవుడ్ బుల్లితెర నటి ఆశా నేగి. వ్యాక్సిన్ తీసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రజలల్లో అవగాహనా తేవడం మంచి పరిణామమే. కానీ కొందరు నటులు చేస్తున్న అతి చూస్తుంటే, ఇబ్బందికరంగా ఉంటుంది.. అంటూ ఆశా నేగి ఇంస్టాగ్రామ్ లో సందేశం పోస్ట్ చేశారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by MsNegi (@ashanegi)


కాగా ఆశా నేగి పోస్ట్ నటి అంకిత లోఖండే గురించే అని నెటిజెన్స్ భావిస్తున్నారు. ఈ మధ్య కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న అంకిత చిన్న పిల్ల మాదిరి చాలా గోల చేశారు. అంకితా చేసిన అతిపై సెటైర్స్ వేస్తూ  ఆశా నేగి ఈ పోస్ట్ పెట్టారని బాలీవుడ్ టాక్. కాగా పవిత్ర రిష్తా సీరియల్‌లో దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, అంకిత లోఖండేతో పాటు ఆశా నేగి కూడా ఓ ముఖ్య పాత్రలో నటించింది. ఆమె చివరిసారిగా కునాల్‌ కెమ్ము అభయ్‌ 2లో కనిపించింది.