స్టార్  హీరోయిన్‌ అనుష్క బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మహా నందీశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అయితే ఆమె కేవలం పూజలు కోసమే వెళ్లారా లేక పోలవరం చూసి వద్దామని వెళ్లారా అనే విషయాలు తెలియరాలేదు. దైవ భక్తి ఎక్కువగా ఉన్న అనుష్క..తన జాతకం ప్రకారం పూజలకు వెళ్లి ఉండవచ్చనని ఫిల్మ్ సర్కిల్స్ జనం అంటున్నారు. అయితే అసలు విషయం ఏమిటనేది మరికాస్సేపట్లో తెలుస్తుంది. 

కెరీర్ విషయానికి వస్తే.. అనుష్క నటించిన నిశ్శబ్ధం చిత్రం ఓటీటీ ద్వారా విడుదలైంది.  అలాగే ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ఓ చిత్రం చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే అనుష్క అఫీషియల్ గా ఖరారు చేసి చెప్పలేదు. అదేవిధంగా ఒక తమిళ చిత్రంలో అవకాశం అనుష్కను వెతుక్కుంటూ వచ్చింది. దీన్ని ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో నటుడు విజయ్‌ సేతుపతి హీరోగా నటించనున్నారు. ఆయనకు జంటగా అనుష్క నటించడానికి సిద్ధమవుతోంది.  

కాగా ఈ చిత్రం కోసం బ్యూటీ రూ.3 కోట్లు డిమాండ్‌ చేసినట్టు వార్తలు వచ్చాయి.  తాను బహుభాషా నటినని, తన చిత్రాలకు తెలుగు, తమిళం తదితర భాషల్లో మంచి ఆదరణ ఉంటుందని, కాబట్టి తన రెమ్యునేషన్ విషయంలో తగ్గే సమస్య లేదని అనుష్క క్లియర్ గా చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రంలో నటించనున్న విజయ్‌ సేతుపతి రూ. 10 కోట్లు పారితోషికం ఇస్తుండగా తనకు రూ. 3 కోట్లు ఇవ్వడం న్యాయం అని అనుష్క పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో చేసేదిలేక చిత్ర దర్శక నిర్మాతలు ఈ స్వీటీకి డిమాండ్‌ చేసిన మొత్తాన్ని ఇవ్వడానికి అంగీకరించక తప్పలేదని తెలిసింది.