మరో హీరో,హీరోయిన్ బ్రేకప్ స్టోరీ!

actress anjali ends relationship with hero jai
Highlights

తెలుగమ్మాయి బ్రేకప్ స్టోరీ

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, బ్రేకప్ అనేవి చాలా కామన్. తమకు నచ్చిన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతుంటారు కూడా.. కానీ ఎక్కువగా ప్రేమ జంటలు విడిపోతూనే కనిపిస్తుంటారు. తాజాగా తెలుగమ్మాయి అంజలి కూడా తన బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిందని టాక్. కోలివుడ్ హీరో జైతో కొన్నాళ్లపాటు సహజీవనం చేసిన అంజలి ఇప్పుడు మాత్రం అతడితో కలిసి లేదని అంటున్నారు. 

గతేడాది జై పుట్టినరోజు నాడు అతడు ఎక్కడో దూరంగా షూటింగ్ లో ఉంటే అక్కడకి వెళ్లి మరీ కేక్ కట్ చేయించి సర్ప్రైజ్ చేసింది. చెన్నైలో వీరిద్దరూ కలిసి ఓ అపార్ట్ మెంట్ లో ఉండేవారు కానీ ఇప్పుడు ఏమైందో ఏమో అంజలి మాట మార్చేసి జై తనకు కేవలం స్నేహితుడు మాత్రమేనని చెబుతోంది. నిన్న అంజలి పుట్టినరోజు కావడంతో కోలివుడ్ కు చెందిన ప్రముఖులు అందరూ కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

సోషల్ మీడియాలో ఆమెకు వరుస మెసేజ్ లో చేస్తూనే ఉన్నారు. జై మాత్రం పత్తా లేకుండా పోయాడు. ఫేస్ బుక్ లో గానీ, ట్విట్టర్ లో గానీ ఆమెకు విషెస్ చెప్పనేలేదు. త్వరలోనే వీరిద్దరూ కలిసి నటించిన 'బెలూన్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బహుసా వీరిద్దరూ కలిసి నటించే ఆఖరి సినిమా ఇదే కావొచ్చు అంటూ కోలివుడ్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది. వీరిద్దరూ కలిసే ఛాన్స్ లేదని అంటున్నారు. 

loader