సల్మాన్ ఖాన్ క్లోజ్ ఫ్రెండ్ విందు దారా సింగ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారింది. సల్మాన్ ఖాన్ ని ఆయన పంది, కుక్కలతో పోల్చాడు. ఆయన ఎందుకు అలా అన్నారో ఈ స్టోరీలో చూద్దాం..
సల్మాన్ ఖాన్ కి ఉన్న మరో పేరు కండల వీరుడు. బాలీవుడ్ హీరోల్లో చాలా మంది సిక్స్ ప్యాక్ చేశారు. అయితే సల్మాన్ ఖాన్ పెట్టింది పేరు. కాగా సల్మాన్ ఖాన్ భారీగా తింటారట. అయినప్పటికీ ఫిట్ బాడీ ఎలా సాధ్యం అనే సందేహం రావచ్చు. ఈ సందేహాలకు సల్మాన్ ఖాన్ మిత్రుడు విందు దారా సింగ్ క్లారిటీ ఇచ్చాడు. నటుడు విందు దారా సింగ్ - సల్మాన్ ఖాన్ కాలేజ్ మేట్స్ అట. అప్పటి నుండి వారి పరిచయం కొనసాగుతుంది.
సల్మాన్ గురించి విందు దారా సింగ్ మాట్లాడుతూ... నన్ను చూసి సల్మాన్ ఖాన్ ఎక్సర్సైజులు చేయడం స్టార్ట్ చేశాడు. సల్మాన్ ఖాన్ పందిలా తింటాడు. కుక్కలా వ్యాయామం చేస్తాడు. ఇంత తింటావు, అదంతా ఎక్కడికి పోతుందని అడిగితే... వ్యాయామం ద్వారా కరిగిస్తాను అంటాడు. సల్మాన్ ఖాన్ గంటల తరబడి వ్యాయామం చేస్తాడు. సల్మాన్ ఖాన్ చాలా మంచివాడు. డబ్బు తన వద్ద ఉంచుకోడు. తండ్రి సలీం ఖాన్ ఎంత ఇచ్చినా అది పని వాళ్లకు ఇచ్చేస్తాడు.
తండ్రి వద్ద ఇప్పటికీ పాకెట్ మనీ తీసుకుంటాడు. అది పేదవాళ్లకు పంచేస్తాడు. నెలకు రూ. 25 నుండి 30 లక్షలు దాన ధర్మాలు చేస్తాడు. సల్మాన్ అంటే నాకు చాలా ఇష్టం. అతడు అద్భుతమైన వ్యక్తి... అన్నాడు. నటుడు విందు దారా సింగ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా ఈ మధ్య సల్మాన్ బాక్సాఫీస్ వద్ద స్ట్రగుల్ అవుతున్నాడు. రేసులో కొంచెం వెనుకబడ్డాడని చెప్పొచ్చు. ఖాన్ త్రయం లో ఒకడైన షారుక్ గత ఏడాది ఫుల్ ఫార్మ్ లోకి వచ్చాడు. మూడు బ్యాక్ టు బ్యాక్ హిట్ ఇచ్చాడు.
