నిన్న సాయంత్రం సరదాగా కమెడియన్స్ అందరూ స్కూల్ యూనిఫామ్స్ వేసుకుని దిగిన ఫోటోను షేర్ చేశాడు.
నటుడు వెన్నెల కిశోర్ కి హాస్యచతురత కాస్త ఎక్కువే. సినిమాల్లో మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో కూడా తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ అందరినీ నవ్విస్తుంటాడు. ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉండే ఈయన తాజాగా చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
Scroll to load tweet…
నిన్న సాయంత్రం సరదాగా కమెడియన్స్ అందరూ స్కూల్ యూనిఫామ్స్ వేసుకుని దిగిన ఫోటోను షేర్ చేశాడు. బ్యాక్2స్కూల్ థీమ్ పార్టీ అంటూ.. పోస్ట్ చేసిన వెన్నెల కిషోర్.. ఈ సారి మాత్రం నాకు మరీ చిన్న షార్ట్ వచ్చిందంటూ.. ట్వీట్ చేశాడు. ఈ ఫోటోలో నందు, సప్తగిరి, ధన్‌రాజ్, రోలర్ రఘు, చిత్రం శ్రీను, వేణు వండర్‌లతో పాటు మరికొంతమంది ఉన్నారు. మరి వీరందరూ కలిసి ఆదివారం బాగానే ఎంజాయ్ చేసినట్టున్నారు.
Scroll to load tweet…
