మొదటి భార్యతో అందుకే విడిపోయాను, ఆస్తి చెరో సగం తీసుకున్నాం... ఓపెన్ అయిన నటుడు సురేష్
నటుడు సురేష్ ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అయితే ఒకప్పుడు ఆయన తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరో. 1990లో అనిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సురేష్ కొన్నాళ్లకు విడాకులు ఇచ్చాడు. అందుకు కారణాలు ఏమిటో తాజాగా వెల్లడించాడు.
తెలుగువాడు అయినప్పటికీ సురేష్ కెరీర్ తమిళ్ లో మొదలైంది. తొలినాళ్లలో ఆయన తమిళ్ లో వరుస చిత్రాలు చేశారు. 1981లో విడుదలైన పన్నీర్ పుష్పాంగళ్ ఆయన మొదటి చిత్రం. తెలుగులో స్టార్డం వచ్చాక తెలుగు, తమిళ భాషల్లో చిత్రాలు చేశారు. పదేళ్ళపాటు హీరోగా సురేష్ చక్రం తిప్పారు. మెల్లగా ఫేడ్ అవుట్ అవుతూ వచ్చారు. సపోర్టింగ్, విలన్ రోల్స్ కూడా చేశారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యాడు.
ఇటీవల సురేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో మొదటి భార్య అనిత గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆమెతో విడిపోవడానికి బలమైన కారణాలు ఏమీ లేవని సురేష్ అన్నారు. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. నాకు 20, ఆమెకు 18 ఏళ్ల వయసులో పెళ్లి చేశారు. అనితకు చదువుకుని అమెరికాలో సెటిల్ కావాలనే కోరిక ఉండేది. నటుడిగా నేను అక్కడకు వెళ్లడం కుదరదు. మొదట్లో ఆమె పరిశ్రమలోనే ఉండేవారు. చదువుకోవాలనే కోరికతో నటన మానేసింది.
అందుకే మేము విడాకులు తీసుకున్నాము. అమెరికాలో చదువుకుని అక్కడే ఓ వ్యక్తిని వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది. నేను కూడా రెండో వివాహం చేసుకున్నాను. మా మధ్య మంచి అనుబంధం ఉంది. నేను అమెరికా వెళితే వాళ్ళ ఇంట్లోనే స్టే చేస్తాను. వాళ్ళు ఇక్కడికి వస్తే మా ఇంటికి వస్తారు. అనిత భర్త కూడా మంచివారు. నా కొడుకుని చాలా బాగా చూసుకుంటాడు. నన్ను పెళ్లి చేసుకున్నాక ఆమె అనిత సురేష్ అని పేరు మార్చుకుంది. ఇప్పటికీ అదే పేరు కంటిన్యూ చేస్తుంది.
నేను సంపాదించానో నువ్వు సంపాదించిందో అనేది అనవసరం... ఉన్న ఆస్థి చెరో సగం తీసుకుందాం అనుకున్నాము. అదే చేశాము.. అని సురేష్ చెప్పుకొచ్చాడు.1995లో సురేష్-అనిత విడాకులు తీసుకున్నారు. కాగా గత ఏడాది నిఖిల్ హీరోగా నటించిన స్పై మూవీలో సురేష్ ఓ కీలక రోల్ చేశారు. సురేష్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడాను. మనం తమిళ్ వెర్షన్ కి నాగార్జునకు డబ్బింగ్ చెప్పాడు.