ప్రముఖ నటుడు బాహుబలి కట్టప్ప పాత్రలో జాతీయవ్యాప్తంగా గుర్తింపు పొందిన సత్యరాజ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సత్యరాజ్ తల్లి నాదాంబాళ్ కళింగరాయర్ (94) వృద్దాప్యం కారణంగా మరణించారు.

ప్రముఖ నటుడు బాహుబలి కట్టప్ప పాత్రలో జాతీయవ్యాప్తంగా గుర్తింపు పొందిన సత్యరాజ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సత్యరాజ్ తల్లి నాదాంబాళ్ కళింగరాయర్ (94) వృద్దాప్యం కారణంగా మరణించారు. నాదాంబాళ్ తమిళనాడులోని కోవై లో ఉంటున్నారు. 

కాగా వృద్ధాప్య సమస్యలు అధికం కావడంతో ఆమె శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కాగా సత్యరాజ్ నిన్న హైదరాబాద్ లో ఓ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తన తల్లి మరణ వార్త తెలియగానే సత్యరాజ్ షూటింగ్ ఆపేసి హుటాహుటిన కోయంబత్తూర్ బయలుదేరారు. 

తన తల్లి నాదాంబాళ్ కి తాను నటించిన చిత్రాలు అంటే చాలా ఇష్టం అని గతంలో తెలిపారు. తాను నటించిన ప్రతి చిత్రాన్ని ఆమె చూస్తారట. నాదాంబాళ్ కి సత్యరాజ్ తో పాటు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఆ ఇద్దరు కుమార్తెలు కల్పనా, రూపా సేనాధిపతి. 

సత్యరాజ్ తల్లి మృతి పట్ల హీరో, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా సత్యరాజ్ కి సానుభూతి తెలుపుతూ నాదాంబాళ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. 

సత్యరాజ్ బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రతో ఎంతటి గుర్తింపు పొందారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జెర్సీ, మిర్చి, ప్రతి రోజు పండగే లాంటి చిత్రాల్లో కూడా సత్యరాజ్ అద్భుతమైన నటన కనబరిచారు.