నేడు సైఫ్ అలీ ఖాన్ బర్త్ డే. ఈ సందర్భంగా దేవర మూవీ నుండి ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. భైరవగా సైఫ్ అలీ ఖాన్ లుక్ కేకపుట్టించింది.
హీరోయిజం ఎలివేట్ కావాలంటే అంతకంటే బలమైన విలనిజం ఉండాలి. దేవర విషయంలో దర్శకుడు కొరటాల శివ అదే చేస్తున్నాడనిపిస్తుంది. నేడు దేవర విలన్ ని పరిచయం చేయగా అంచనాలు ఆకాశానికి చేరాయి. సైఫ్ అలీ ఖాన్ దేవర చిత్రంలో మెయిన్ విలన్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన జన్మదినం పురస్కరించుకొని సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దేవరలో ఆయన పాత్ర పేరు భైరవ అట.
ఉంగరాల జుట్టుతో నల్ల బట్టలు ధరించి తీక్షణమైన చూపులతో సైఫ్ అలీ ఖాన్ భైరవగా ఆకట్టుకున్నాడు. చెప్పాలంటే భైరవ లుక్ భయానకంగా ఉంది. విలన్ క్యారెక్టరైజేషన్ ఓ రేంజ్ లో ఉంటుందని అర్థం అవుతుంది. దేవర వర్సెస్ భైరవ పోరు సిల్వర్ స్క్రీన్ పై ఓ రేంజ్ లో ఉండనుందని అర్థం అవుతుంది. మొత్తంగా దేవర విలన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాడు.
దేవర దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. శ్రీదేవి వారసురాలైన జాన్వీ కపూర్ ఫస్ట్ సౌత్ ఇండియా మూవీ దేవర. గతంలో చాలా మంది మేకర్స్ ఆమెను తెలుగు, తమిళ భాషల్లో నటింపజేయాలని ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ తో ఆమె జతకట్టేందుకు సిద్ధమయ్యారు. శ్రీదేవి కూతురు ఎన్టీఆర్ మనవడితో నటించడం విశేషంగా మారింది. ఆమె పాత్ర కూడా కథలో చాలా కీలకమని దర్శకుడు కొరటాల చెప్పారు.
2024 ఏప్రిల్ 5న దేవర విడుదల కానుంది. ఈ క్రమంలో వరుస షెడ్యూల్స్ తో శరవేగంగా సినిమా పూర్తి చేస్తున్నారు. దేవర చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తుంది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న మూవీ కావడంతో మరింత హైప్ ఏర్పడింది. ఇక కొరటాల శివకు ఈ చిత్ర విజయం చాలా కీలకం.
