Asianet News TeluguAsianet News Telugu

స్నేహితుడి చేతిలో మోసపోయిన రేసుగుర్రం విలన్ రవికిషన్, ఎన్ని కోట్లు పోగొట్టుకున్నాడో తెలుసా..?

ఈ మధ్య నమ్మించి మోసం చేయడాలు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా వ్యాపారంలో. దీనికి సినిమా వాళ్లేమి అతీతులు కారు. సినిమావాళ్లు కూడా మోసం చేయడమో.. మోసపోవడమో జరుగుతూనే ఉంది. రీసెంట్ గా స్పేహితుడి చేతుల్లో రేసుగుర్రం విలన్ దారుణంగా మోసపోయాడు.. అది కూడ కోట్లలోనే. 

Actor Ravi Kishan files a police complaint  Against His Friend
Author
First Published Sep 29, 2022, 10:55 AM IST

ఈ మధ్య నమ్మించి మోసం చేయడాలు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా వ్యాపారంలో. దీనికి సినిమా వాళ్లేమి అతీతులు కారు. సినిమావాళ్లు కూడా మోసం చేయడమో.. మోసపోవడమో జరుగుతూనే ఉంది. రీసెంట్ గా స్పేహితుడి చేతుల్లో రేసుగుర్రం విలన్ దారుణంగా మోసపోయాడు.. అది కూడ కోట్లలోనే. 

రేసు గుర్రం సినిమాతో.. ఓ రేంజ్ లో  పాపులారిటీ సంపాదించుకున్నాడు రవికిషన్. ప్రస్తుతం ఆయన బీజేపి నుంచి ఎంపీగా ఉన్నాడు. అనూహ్యంగా ఆయన  తాను మోసపోయినట్టు తన స్నేహితుడిపైనే కంప్లైయింట్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఇపుడు అంతటా ఇది  చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గోర‌ఖ్‌పూర్ ఎంపీగా ఉన్న ర‌వికిష‌న్ 2012లో త‌న స్నేహితుడికి దాదాపు పదేళ్ళ క్రిందట మూడు కోట్లకు పైగా డబ్బును అప్పుగా ఇచ్చాడట. 

రవికిషన్ స్నేహితుడు.. ముంబైకి చెందిన వ్యాపార‌వేత్త అయిన జైన్ జితేంద్ర ర‌మేష్ ఆ డబ్బుును తిరిగి చెల్లించడంలో భాగంగా.. రవికిషన్ కు 34 ల‌క్ష‌ల చొప్పున 12 చెక్కుల‌ను ఇవ్వడం జరిగింది. అయితే ఆ చెక్కులో ఒక చెక్కును బ్యాంక్ లో డిజాజిట్ చేయగా.. అది బౌన్స్ అయ్యింది. తరువాత తన స్నేహితుడు జితేంద్ర రమేష్ కు ఫోన్ చేసినా సరైన సమాధానం రాకపోవడంతో విసిగిపోయిన  ర‌వికిష‌న్.. జైన్ జితేంద్ర నుంచి స్పంద‌న స‌రిగా లేక‌పోవ‌డంతో గోర‌ఖ్‌పూర్ పోలీస్ స్టేష‌న్‌లో అత‌నిపై ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ర‌వికిష‌న్ పీఆర్‌వో ప‌వ‌న్ ధూబే తెలిపారు. 

ఇక ఈ సంఘటనపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నట్టు కంటోన్మెంట్ పీఎస్ ఇన్‌చార్జ్ శ‌శి భూష‌ణ్ రాయ్ కూడా ద్రువీకరించారు. ఇక బోజ్ పూరీ హీరోగా ఉన్న ర‌వికిష‌న్ తెలుగులో రేసుగుర్రంతో టాలీవడ్ లో స్టార్ అయ్యాడు. ఆతరువాత వరుసగా సైరా న‌ర‌సింహారెడ్డి, MLA, సాక్ష్యం, ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, లై, రాధ‌, సుప్రీమ్‌, కిక్ 2, హీరో లాంటి సినిమాల్లో నటించాడు కిషన్.  భోజ్‌పురి తో పాటు  హిందీ, క‌న్న‌డ, తెలుగు భాష‌ల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ర‌వికిష‌న్. 

Follow Us:
Download App:
  • android
  • ios