Rajinikanth: అర్దరాత్రి వేళ హాస్పిటల్‌ లో చేరిన రజనీకాంత్‌, ఏమైందంటే?

అర్థరాత్రి చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో రజనీకాంత్‌ను చేర్పించినట్లు సమాచారం. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇంతకి ఏం జరిగిందంటే..

Actor Rajinikanth hospitalised in Chennai jsp

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (73) ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. వైద్యులు ఆయన గుండెకు సంబంధించి పలు వైద్య పరీక్షలను మంగళవారం చేయాల్సి ఉండటంతో సోమవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరినట్లు తమిళ చిత్ర వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. రజనీకాంత్‌కు మంగళవారం (అక్టోబర్ 1) ఎలక్టివ్ ఆపరేషన్ నిర్వహించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారట. అయితే, ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.  

పనిగట్టుకుని బిగ్‌ బాస్‌ విన్నర్‌ని తయారు చేస్తున్న యష్మి..బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్ల కోసం ఇక్కడ చూండి.

చెన్నై పోలీస్ లు చెప్పినదానికి ప్రకారం ఆయనకు తీవ్రమైన కడుపులో నొప్పి రావటంతో వెంటనే హాస్పటిల్ లకు తీసుకొచ్చారు. అలాగే తమిళ మీడియా సమాచారం మేరకు డాక్టర్ల టీమ్ ఆయన్ను పర్యవేక్షిస్తోంది. కార్డియాలిజిస్ట్ డా.సాయి సతీష్ సూపర్ వైజన్ లో ప్రొసీజర్ ప్రకారం టెస్ట్ లు జరగనున్నాయి.  అయితే, రజనీకాంత్‌ (Rajinikanth) ఆస్పత్రిలో చేరడంపై వైద్యుల నుంచి గానీ, రజనీకాంత్‌ కుటుంబం నుంచి గానీ.. ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

‘వేట్టయన్‌’రిలీజ్ కు రెడీ,సెన్సార్ పూర్తి

ప్రస్తుతం ఆయన వేట్టయాన్‌, కూలీ చిత్రాల్లో నటిస్తున్నారు. వేట్టయాన్‌ అక్టోబర్‌ 10న విడుదల కానుంది. దసరా కానుకగా బాక్సాఫీసు ముందుకొస్తున్న చిత్రాల్లో ‘వేట్టయన్‌’ (Vettaiyan) ఒకటి. రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా రూపొందిన ఈ సినిమా అక్టోబరు 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సెన్సార్‌ కార్యక్రమాలు  పూర్తయ్యాయి. సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. ఈ మూవీ రన్‌టైమ్‌: 163.25 నిమిషాలు (2 గంటల 43 నిమిషాల 25 సెకన్లు) (Vettaiyan Runtime). మూడు డైలాగులుపై సెన్సార్‌ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటిని మ్యూట్‌ చేయడమో.. వేరే పదాలు వినియోగించడమో చేయాలని చిత్ర టీమ్ కి సూచించింది.

Actor Rajinikanth hospitalised in Chennai jsp

రిటైర్డ్ అధికారిగా రజనీకాంత్

తమిళనాడులో గతంలో జరిగిన ఓ బూటకపు ఎన్‌కౌంటర్‌ నేపథ్యంతో దర్శకుడు టి.జె. జ్ఞానవేల్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇది రజనీకాంత్‌కు 170వ చిత్రం. ఆయన ఇందులో రిటైర్డ్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నట్టు సమాచారం. అమితాబ్‌ బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా, రితికా సింగ్‌, మంజు వారియర్‌, దుషారా విజయన్‌ కీలక పాత్రలు పోషించారు. తెలుగులోనూ అదే పేరుతో విడుదల కానుంది. అక్టోబరు 2న ట్రైలర్‌ను రిలీజ్‌ చేయనున్నారు. ఈ సినిమా రజనీకాంత్‌ ఇమేజ్‌కు పూర్తి భిన్నమైందంటూ రానా, సంగీత దర్శకుడు అనిరుధ్‌ వేర్వేరు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించారు.

‘వేట్టయన్‌ ప్రివ్యూ’కు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ 

‘వేట్టయన్‌: ద హంటర్‌’తో ప్రేక్షకుల్ని అలరించనున్నారు రజనీకాంత్‌. ఆయన హీరోగా నటించిన ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని టి.జె.జ్ఞానవేల్‌ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. అమితాబ్‌ బచ్చన్, రానా, ఫహాద్‌ ఫాజిల్, మంజు వారియర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రీసెంట్ గా చిత్ర టీమ్ ‘వేట్టయన్‌ ప్రివ్యూ’ పేరుతో తెలుగు టీజర్‌ విడుదల చేసింది. ‘‘ఈ దేశంలో లక్షలాది మంది పోలీసు అధికారులున్నారు. కానీ, వీళ్లని మాత్రమే చూడగానే గుర్తుపడుతున్నారంటే అదెలా సాధ్యమవుతుంది’’ అంటూ అమితాబ్‌ బచ్చన్‌ ప్రశ్నతో మొదలైన టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 

Actor Rajinikanth hospitalised in Chennai jsp

ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా రజనీకాంత్

ఇందులో రజనీ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా శక్తిమంతమైన పోలీసు పాత్రలో కనిపించనున్నట్లు ఈ  టీజర్ ని బట్టి అర్థమవుతోంది. టీజర్‌లో రజనీ తనదైన స్టైల్, శ్వాగ్‌తో యాక్షన్‌ కోణంలో ఆసక్తి రేకెత్తించేలా కనిపించారు. ఆఖర్లో ‘‘ఎన్‌కౌంటర్‌ పేరుతో ఓ మనిషిని హత్య చేయడం అదొక హీరోయిజమా’’ అని అమితాబ్‌ ప్రశ్నించగా.. ‘‘ఎన్‌కౌంటర్‌ అనేది నేరం చేసిన వాళ్లకు విధించే శిక్ష మాత్రమే కాదు. ఇక మీదట ఇలాంటి నేరం మళ్లీ జరగకూడదని తీసుకునే ముందు జాగ్రత్త చర్య’’ అంటూ రజనీ బదులివ్వడం టీజర్‌కు ఆకర్షణగా నిలిచింది. ఇందులో రితికా సింగ్, దుషారా విజయన్, కిశోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతమందించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios