Asianet News TeluguAsianet News Telugu

సినిమాల్లో రాజకీయాలెక్కువ.. అందుకే చనిపోవాలనుకున్నాః రాజా షాకింగ్‌ కామెంట్‌

లవర్‌ బాయ్‌గా టాలీవుడ్‌లో రాణించిన రాజా `ఓ చినదాన` చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. `వెన్నెల`, `ఆనంద్‌` చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చాయి. ముఖ్యంగా `ఆనంద్‌` రాజా కెరీర్‌నే మలుపుతిప్పింది. సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా ఓ ఇంటర్య్వూలో అనేక ఆసక్తికర, షాకింగ్‌ విషయాలను పంచుకున్నారు.

actor raja shocking comments on tollywood  arj
Author
Hyderabad, First Published Jan 7, 2021, 6:48 PM IST

సినిమాల్లో రాణించేందుకు అనేక ఇబ్బందులు పడ్డానని, అనేక అవమానాలు ఎదుర్కొన్నానని, ఒకానొక దశలో ఇదేం బతుకురా బాబు అని విరక్తితో చనిపోవాలనుకున్నాన`ని అంటున్నారు హీరో రాజా. లవర్‌ బాయ్‌గా టాలీవుడ్‌లో రాణించిన రాజా `ఓ చినదాన` చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. `వెన్నెల`, `ఆనంద్‌` చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చాయి. ముఖ్యంగా `ఆనంద్‌` రాజా కెరీర్‌నే మలుపుతిప్పింది. 

ఇటీవల సినిమాలు లేక, ఫాస్టర్‌గా మారిపోయారు. సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా ఓ ఇంటర్య్వూలో అనేక ఆసక్తికర, షాకింగ్‌ విషయాలను పంచుకున్నారు.`తనకు ఐదేళ్ల వయసులోనే తల్లిచనిపోయిందని, పద్నాగేళ్లున్నప్పుడు అనారోగ్యంతో తండ్రి చనిపోయాడని, తనని ఇద్దరు అక్కలే పెంచారని చెప్పారు. దేవుడు ఒక తల్లిని తీసుకెళ్లి ఆ స్థానంలో ఇద్దరు తల్లులను ఇచ్చారంటూ ఎమోషనల్‌ అయ్యారు. 

ఇంకా చెబుతూ, `హీరో కావాలనే కోరికతో తొలుత ప్రతి సినిమా ఆఫీస్‌ చుట్టూ తిరిగాను. దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆఫీస్‌కి వెళ్లినప్పుడు ఆయన `నువ్వు హీరో ఏంటీ, నీ మొహం అద్దంలో చూసుకున్నావా` అని అవమానించారు. ఆయన వెటకారంగా అన్నప్పటికీ వ్యక్తంగా తమ్మారెడ్డి మంచి మనిషి. సినిమా అవకాశాల కోసం చూస్తున్నప్పుడు నా జేబులో ఐదు వందలు కూడా లేవు. అనేక ఇబ్బందులు పడ్డాను. ఒకానొక దశలో జీవితంపై విరక్తితో చనిపోవాలనుకున్నా. కానీ అందరు పడతారు, చస్తారు, నాకలాంటి బతుకొద్దు, అలాంటి చావు వద్దు అనుకున్నా. నేను బతికినా, చచ్చినా గొప్పగా ఉండాలనుకున్నా` అని చెప్పారు. 

`హీరో కావాలని గట్టిగా ప్రయత్నించాను. ఈ క్రమంలో శేఖర్‌ కమ్ముల గారు `ఆనంద్‌` సినిమా స్క్రిప్ట్ ని నాకు వినిపించారు. కథ నచ్చి వెంటనే చేశా. హీరో అయిన తర్వాత నా కెరీర్‌ బాగానే సాగినా, ఆ తర్వాత నా సినిమాలకు థియేటర్లు దొరికేవి కావు. పెద్ద నిర్మాతలతో గొడవలకు కూడా దిగాను. నాకు బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోవడంతో వాళ్లని ఎదురించి చిత్ర పరిశ్రమలో కొనసాగలేకపోయాను. సినిమాల్లో రాజకీయాలు ఎక్కువ. అందుకే సినిమాలు మానేశా` అని తెలిపారు. హీరో కాక ముందు హైదరాబాద్‌ లోని గ్రీన్‌ పార్క్ హోటల్‌లో రిసెప్షనిస్ట్ గా కూడా పనిచేశానని తెలిపారు. 

సినిమాలు చేయడం ఆపేశాక పాస్టర్ అయ్యారు రాజా. 2014లో అమృతను క్రిస్టియన్‌ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి లియోరా అనే కూతురు కూడా ఉంది. సినిమాలకు దూరంగా పాస్టర్ గా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios