Asianet News TeluguAsianet News Telugu

Prudhvi Raj: కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న నటుడు పృథ్వి రాజ్

కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పృథ్వి రాజ్(Prudhvi Raj) కడపలోని అమీన్ పూర్ దర్గాను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసిన ఆయన అక్కడ విశేషాలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.

Actor Prudhvi Raj In Kadapa Dargah
Author
Hyderabad, First Published Jan 14, 2022, 2:20 PM IST

కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పృథ్వి రాజ్ కడపలోని అమీన్ పూర్ దర్గాను దర్శించుకున్నారు. దర్గా నిర్వహకులు పృథ్వి కి ఘనంగా స్వంగతం పలికారు. దర్గా మజర్ల వద్ద పూల చాదర్ ను సమర్పించి, ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించిన  పృథ్వి రాజ్(Prudhvi Raj).. అక్కడ  ప్రత్యేక పూజలు చేశారు. అంతే కాదు ఈ దర్గా విశిష్టతను.. దర్గా చరిత్రను అడిగి తెలుసుకున్నారు. ఎంతో శ్రద్దగా వారు చెప్పింది విన్నారు.

టాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేక స్తానాన్ని సంపాధించుకున్నారు పృథ్వి రాజ్(Prudhvi Raj). ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. తరువాత హీరోగా కూడా తన టాలెంట్ ను చూపించారు పృథ్వి. ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో బాగా ఫేమస్ అయిన పృథ్వి రాజ్.. 30 ఇయర్ ఇండస్ట్రీ పృథ్వి గా పేరు సాధించారు. ఇండస్ట్రీలో ఏ హీరోను ఇమిటేట్ చేయాలన్నా ఆయనే.. ముఖ్యంగా పృథ్వి రాజ్(Prudhvi Raj) బాలకృష్ణ(Balakrishna)ను బాగా ఇమిటేట్ చేస్తారు. ఒక సారి బాలయ్య అభినందనలు కూడా అందుకున్నారు.

ఈ మధ్య సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో .. సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా సందడి చేయడం లేదు పృథ్వి రాజ్(Prudhvi Raj). వైసీపి లో మెంబర్ గా ఉన్న ఆయన.. టీటీడి భక్తి ఛానల్ చైర్మన్ గా కూడా సేవలు అందించారు. ఈ మధ్య సినిమా అవకాశాలు తగ్గడంతో అడపాదడపా.. అక్కడక్కడ.. మాత్రమే కనిపిస్తున్నారు పృథ్వి రాజ్. వివాదాస్పద డైలాగ్స్ తో బాగా ఫేమస్ అయ్యారు పృథ్వి రాజ్.

Follow Us:
Download App:
  • android
  • ios