Asianet News TeluguAsianet News Telugu

నరసింహపురం చిత్ర టీమ్ కి ప్రకాష్ రాజ్ ప్రశంసలు

'నరసింహపురం' చిత్ర బృందాన్ని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు.

actor prakash raj prises narasimhapuram movie team ksr
Author
Hyderabad, First Published Jul 14, 2021, 3:58 PM IST

గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై..  పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాలతో కలిసి 'శ్రీరాజ్ బళ్లా' స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'నరసింహపురం' చిత్ర బృందాన్ని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. సిరి హనుమంతు హీరోయిన్ గా నటిస్తుండగా.. వర్ధమాన నటి ఉష హీరో చెల్లెలు పాత్రలో నటించారు. 
     
సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని థియేటర్స్ లో విడుదలకు సిద్దంగా ఉన్న ఈ చిత్రానికి ఘన విజయం సాధించేందుకు అవసరమైన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయని.. కరోన ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి "నరసింహపురం" చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేస్తున్న హీరో-దర్శకనిర్మాతలను ఎంతైనా అభినందించేయాల్సిందేనని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. పరిశ్రమ పచ్చగా కలకళలాడాలంటే "నరసింహపురం" వంటి మీడియం బడ్జెట్ చిత్రాలు భారీ విజయాలు సాధించాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హీరో నందకిషోర్, చెల్లెలు పాత్రధారి  ఉష, ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించిన రవివర్మ బళ్లా దర్శకుడు శ్రీరాజ్ బళ్లా, నిర్మాత ఫణిరాజ్ గౌడ్, సినిమాటోగ్రఫర్ కర్ణ ప్యారసాని, ప్రముఖ నటుడు సమీర్ పాల్గొన్నారు.
     
  ఈ సందర్భంగా హీరో నందకిషోర్ మాట్లాడుతూ... "ప్రకాష్ రాజ్ గారు లాంటి గొప్ప నటుడు మాకు సమయమిచ్చి..
మా సినిమా ట్రైలర్, సాంగ్స్ చూసి... చాలా బాగుందని మెచ్చుకోవడం మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ మరింత పెంచింది. ఆయనకు మా యూనిట్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. "నరసింహపురం'' చిత్రాన్ని ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. సెన్సార్ సభ్యులు సహా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన మా టీమ్ అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ చిత్రాన్ని ప్రాణాధికంగా ప్రేమించి.. ఈ చిత్రం ఎంతో అద్భుతంగా రావడానికి కారకుడైన మా దర్శకనిర్మాత శ్రీరాజ్ బళ్ళాకి స్పెషల్ థాంక్స్"" అన్నారు.
     
  కల్యాణ మాధవి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ విజయ్ కుమార్, అరవిందసమేత ఫేమ్ రంగధామ్, రవివర్మ బళ్ళా, సంపత్, ఫణిరాజ్, స్వామి, శ్రీకాంత్, శ్రీకర్, శివ, జునైద్, గిరిధర్, సాయిరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, మేకప్: కె.వి.బాబు, పబ్లిసిటీ డిజైన్స్: వెంకట్.ఎం, విఎఫెక్స్: చందు ఆది, కెమెరా: కర్ణ ప్యారసాని, ఎడిటింగ్ & డి.ఐ: శివ వై.ప్రసాద్, 5.1 మిక్సింగ్: రమేష్ కామరాజు, పాటలు: గడ్డం వీరు, సంగీతం: ఫ్రాంక్లిన్ సుకుమార్, నిర్మాతలు: శ్రీరాజ్ బళ్ళా- టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాల, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజ్ బళ్ళా!!

Follow Us:
Download App:
  • android
  • ios