Asianet News TeluguAsianet News Telugu

`మా` ఎన్నికలపై బాంబ్‌ పేల్చిన మురళీ మోహన్‌.. పోటీదారులకు బిగ్‌షాక్‌

`మా` ఎన్నికలపై  సీనియర్‌ నటుడు, మాజీ `మా` అధ్యక్షులు మురళీ మోహన్‌ షాకింగ్‌ కామెంట్‌ చేశారు. ఎవరూ ఊహించని విధంగా పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.

actor murali mohan shocking comments on maa elections 2021 arj
Author
Hyderabad, First Published Jul 5, 2021, 7:31 PM IST

`మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌) ఎన్నికలు ఈ సారి రసవత్తరంగా ఉండబోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ సారి అధ్యక్ష రేసులో ఐదుగురు ఉన్నారు. ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమ, సీవీఎల్‌ నరసింహారావు పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో `మా` ఎన్నికలకు సంబంధించి డేట్‌ రాకపోయినప్పటికీ హీటు మాత్రం మామూలుగా లేదు. గత వారం రోజులు `మా` హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ప్రకాష్‌ రాజ్‌ తన ప్యానెల్‌ని ప్రకటించి ప్రెస్‌మీట్‌ పెట్టారు. 

`మా`గాడి తప్పిందని, గౌరవం పోయిందని, దాన్ని గాడిలో పెట్టాలనే కోణంలో ఆయన మాట్లాడారు. మంచు విష్ణు మన ఇళ్లుని మనమే చక్కదిద్దుకుందామన్నారు. సీవీఎల్‌ నర్సింహరావు తెలంగాణ వాదం, తెలంగాణ కళాకారులు, పేద కళాకారులు, మన ఆర్టిస్టులకు ప్రయారిటీ ఇవ్వడం వంటి అంశాలతో ముందుకొచ్చారు. జీవిత, హేమ ఇంకా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌ మహిళా కార్డ్ ని ముందుకు తీసుకొచ్చాడు. ఇలాంటివన్నీ ఇప్పుడు `మా` ఎలక్షన్లని రంజుగా మారుస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో సీనియర్‌ నటుడు, మాజీ `మా` అధ్యక్షులు మురళీ మోహన్‌ షాకింగ్‌ కామెంట్‌ చేశారు. ఎవరూ ఊహించని విధంగా పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఇటీవల చిరంజీవి `మా`కి పెద్ద దిక్కు అయ్యారని చెప్పారు. తాజాగా అసలు ఈ సారి ఎన్నికలే జరగవని షాక్‌ ఇచ్చారు. ఈసారి మా ఎన్నికలు ఉండవని, ఏకగ్రీవమే జరుగుతుందని బాంబు పేల్చారు. గతంలో మా మెంబర్స్‌ తక్కువగా ఉండటంతో చాలా పద్దతిగా ఉండేదని, కానీ ఇప్పుడు అలా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఎవరికి పడితే వాళ్లకు మా సభ్యత్వం దొరుకుతుందని, దీంతో ఎవరు మా మెంబరో కాదో కూడా తెలియడం లేదని విమర్శించారు. 

గాడి తప్పిన 'మా' ను మళ్లీ పట్టాలెక్కించడానికి తనతో పాటు చిరంజీవి, మోహన్ బాబు, జయసుధ, కృష్ణంరాజు లాంటి సినీ పెద్దలు మాట్లాడుకుంటున్నామని చెప్పుకొచ్చారు. అందరిని ఒకతాటి పైకి తెచ్చి ఏకగగ్రీవంగా మా ఎన్నికలు జరిగేలా చూస్తామని పేర్కొన్నారు.  మురళీ మోహన్ కామెంట్స్‌తో మా అధ్యక్ష బరిలో ఉన్న వాళ్లకు ఊహించని షాక్‌ తగిలినట్లయ్యింది. అంతే కాదు ఇప్పుడు లోలోపల పోటీలో ఉన్న వారితో చర్చలు జరుగుతున్నాయనే హింట్‌ ఇచ్చారు మురళీ మోహన్‌.

Follow Us:
Download App:
  • android
  • ios