సీనియర్ నటుడు మురళీమోహన్ అప్పట్లో హీరోగా సినిమాలు చేశారు. అయితే స్టార్ హీరో రేంజ్ మాత్రం కాదు. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారారు. అటువంటి వ్యక్తి ఈరోజు వేల కోట్లకు అధిపతి. ఇంత డబ్బు ఎలా వచ్చిందనే విషయంపై నోరు విప్పారు మురళీమోహన్. రీసెంట్ గా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇందులో భాగంగా  ఎదురైన ఓ ప్రశ్నకి ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చాడు. నిర్మాణంలోకి వచ్చి సాహసాలు చేస్తోన్న తనను రియల్ ఎస్టేట్ వైపు వెళ్లమని చెప్పి నటుడు శోభన్ బాబు తనకు ఎంతో సహాయం చేశారని చెప్పాడు మురళీమోహన్. 

వయసు పైబడిన తరువాత అమ్మయిలతో డ్యూయెట్లు పాడటం, నటించడం ఇష్టం లేక సొంతంగా బ్యానర్ స్థాపించి పాతిక సినిమాల వరకు చేశారట మురళీమోహన్. కొందరిని నమ్మి డిస్ట్రిబ్యూషన్ కంపనీలు పెడితే అవి తనను నిలువునా ముంచేశాయని, తన భాగస్వాములు చనిపోవడంతో వారి అప్పులు కూడా తనే కట్టాల్సిరావడంతో ఆర్థికంగా చితికిపోయాయని చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో శోభన్ బాబు భూమిపై పెట్టుబడి పెట్టాలని సూచించడంతో చెన్నైలో కొన్ని స్థలాలు కొన్నానని, ఆ తరువాత చిత్రపరిశ్రమ  హైదరాబాద్ కి మారడంతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి బాగా క్లిక్ అయినట్లు మురళీమోహన్ వెల్లడించారు.