సీనియర్ హాస్యనటుడు మనోబాల బుధవారం రోజు మే 3న మరణించిన సంగతి తెలిసిందే. మనోబాల బహుముఖ ప్రజ్ఞాశీలి. ఆయన హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , నిర్మాతగా, దర్శకుడిగా రాణించారు.
సీనియర్ హాస్యనటుడు మనోబాల బుధవారం రోజు మే 3న మరణించిన సంగతి తెలిసిందే. మనోబాల బహుముఖ ప్రజ్ఞాశీలి. ఆయన హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , నిర్మాతగా, దర్శకుడిగా రాణించారు. తమిళంలో అత్యంత ఖ్యాతి పొందిన మనోబాల తెలుగు సహా ఇతర భాషల్లో కూడా నటించారు.
కొంతకాలంగా 69 ఏళ్ల వయసులో మనోబాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దీనితో చాలా కాలంగా ఆయన యాక్టివ్ గా లేరు. చివరకు పరిస్థితి విషమించి తిరిగిరానిలోకాలకు వెళ్లారు. మనోబాల మృతితో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో విషాదం నెలకొంది. తమిళ చిత్రాలు ఎక్కువగా తెలుగులోకి డబ్బింగ్ కావడంతో మనోబాల హాస్యం తెలుగు ప్రేక్షకులని కూడా అలరించింది.
1970లో కెరీర్ ప్రారంభించిన మనోబాల ఈ ఏడాది కూడా పలు చిత్రాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రంలో ఆయన జడ్జి పాత్రలో మెరిశారు. కాగా నిన్నటి నుంచి మనోబాల మృతికి తెలుగు, తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతూ నివాళులు అర్పిస్తున్నారు.
అయితే తాజాగా మనోబాల అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరిగాయి. మనోబాలకి భార్య ఉషా మహదేవన్.. కుమారుడు హరీష్ మనోబాల ఉన్నారు. దళపతి విజయ్, కేఎస్ రావికుమార్, మణిరత్నం, దర్శకుడు శంకర్ ఇలా వందలాదిమంది సెలెబ్రిటీలు మనోబాల చివరి చూపు కోసం, నివాళులు అర్పించేందుకు తరలి వచ్చారు.

అయితే నిర్ణీత సమయానికి అనుగుణంగా నేడు మనోబాల అంత్యక్రియలు చెన్నైలోని వలసవరక్కం సెమెట్రీలో జరిగాయి. ఆయన కుమారుడు హరీష్ మనోబాల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. మనోబాల అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత నటుడిగా మారి దాదాపు 300పైన చిత్రాల్లో నటించారు. ఆయిన నటన, హాస్యాన్ని ఇంకా తరాలు గుర్తుంచుకుంటాయి అని తమిళ సినీ ప్రముఖులు చెబుతున్నారు.
