నటుడు మహత్‌ రాఘవేంద్ర తండ్రి అయ్యాడు. ఆయన భార్య ప్రాచీ సోమవారం ఉదయం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నటుడు మహత్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. బిడ్డ పుట్టిన సందర్భంగా తన బిడ్డని హత్తుకుని భార్య ప్రాచీ, తాను సంతోషాన్ని వ్యక్తం చేస్తుండగా తీసిన ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఈ సందర్భంగా మహత్‌ తన హ్యాపీనెస్‌ని పంచుకున్నాడు. 

`ఈ రోజు(సోమవారం) ఉదయం ఓ అందమైన పిల్లాడిని దేవుడు మాకు ప్రసాదించాడు. చిన్నారి రాకతో నేను, ప్రాచీ ఆనందంలో మునిగి తేలుతున్నాం. మీ అందరి ప్రేమాభిమానులకు ధన్యవాదాలు. నాన్నగా ఎంతో ఎగ్జైటెడ్‌గా ఉన్నాను` అని ట్వీట్‌ చేశాడు మహత్‌. దీంతో అభిమానులు తెలుగు, తమిళ సినీ ప్రముఖులు మహత్‌కి విషెస్‌ తెలియజేస్తున్నారు. 

మహత్‌ తెలుగు, తమిళంలో నటుడిగా రాణిస్తున్నారు. తమిళ బిగ్‌బాస్‌2లో పాల్గొన్నాడు. తెలుగులో `బ్యాక్‌ బెంచ్‌స్టూడెంట్‌`, `బన్నీ అండ్‌ చెర్రీ`, `లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మ్యాన్‌` చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు `సైకిల్‌` సినిమాలో నటిస్తున్నాడు. మరోవైపు తమిళంలోనూ హీరోగా బిజీగా న్నాడు. మహత్‌, ప్రాచీ కొన్నాళ్లు డేటింగ్‌ చేశారు. అనంతరం గతేడాది మ్యారేజ్‌ చేసుకున్నారు. ప్రాచీ మాజీ మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌ అన్న సంగతి తెలిసిందే. ఫ్యాషన్‌ రంగంలో అడుగుపెట్టిన ప్రాచీ ప్రస్తుతం దుబాయ్‌లో వ్యాపారం చేస్తుంది.