Asianet News TeluguAsianet News Telugu

తీవ్ర విషాదం.. జూనియర్ బాలయ్య ఇక లేరు

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తమిళ చిత్ర పరిశ్రమలో లెజెండ్రీ నటుడు, కమెడియన్ అయిన టీఎస్ బాలయ్య కుమారుడు జూనియర్ బాలయ్య (70) తుదిశ్వాస విడిచారు. 

Actor Junior Balaiah dies at 70 dtr
Author
First Published Nov 2, 2023, 9:21 AM IST

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తమిళ చిత్ర పరిశ్రమలో లెజెండ్రీ నటుడు, కమెడియన్ అయిన టీఎస్ బాలయ్య కుమారుడు జూనియర్ బాలయ్య (70) తుదిశ్వాస విడిచారు. దీర్ఘకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు పరిస్థితి విషమించడంతో మరణించారు. 

చెన్నైలోని ఆయన వలసరవక్కం నివాసంలో జూనియర్ బాలయ్య మృతి చెందారు. ఆయన అసలు పేరు రఘు బాలయ్య. అభిమానులు జూనియర్ బాలయ్య అని పిలుస్తారు. తమిళంలో ఆయన ఎన్నో చిత్రాల్లో నటించారు. 1975లో జూనియర్ బాలయ్య మీనాట్టు మురుమగాళ్ చిత్రంతో కెరీర్ ప్రారంభించారు. చివరగా ఆయన అజిత్ నేరకొండ పార్వై లాంటి చిత్రాల్లో నటించారు. 

తమిళ సినిమాలో జూనియర్ బాలయ్య.. హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. జూనియర్ బాలయ్య నటించిన చిత్రాల్లో వాసలిలే, సుందర కాండం, కుంకీ లాంటి విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. 

Actor Junior Balaiah dies at 70 dtr

జూనియర్ బాలయ్య మృతితో తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. జూనియర్ బాలయ్యకి కుమార్తె నివేదిత సంతానం. గురువారం రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కుటుంబ సభ్యులంతా జూనియర్ బాలయ్య మృతితో తీవ్ర విషాదంలో ఉన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios