Asianet News TeluguAsianet News Telugu

కల్కి సక్సెస్.. ప్రభాస్ కి చీర్స్... పబ్లిక్ గా మందు కొట్టేస్తున్నారే!


కల్కి మూవీ సక్సెస్ ని మందు కొట్టి సెలెబ్రేట్ చేసుకున్నాడు ప్రముఖ నటుడు జగపతిబాబు.  ప్రభాస్ కి చీర్స్ కూడా చెప్పాడు. ఈ వీడియో వైరల్ అవుతుంది. 
 

actor jagapathi babu celebrates kalki 2829 ad success with vodka cheers to prabhas ksr
Author
First Published Jul 21, 2024, 5:52 PM IST | Last Updated Jul 21, 2024, 5:58 PM IST

కల్కి 2829 AD మూవీ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతిభను దేశవ్యాప్తంగా మెచ్చుకున్నారు. బాలీవుడ్ ప్రముఖులు సైతం నాగ్ అశ్విన్ మీద ప్రశంసలు కురిపించడం విశేషం. మహాభారతంలోని పాత్రలను, భవిష్యత్ ప్రపంచాన్ని... కల్కి రాకతో ముడిపెట్టి నాగ్ అశ్విన్ ఒక సరికొత్త కథను సిద్ధం చేసుకున్నాడు. 

మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ అంటూ కొత్త జోనర్ పరిచయం చేశాడు. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిన కల్కి చిత్రం ప్రేక్షకులకు గొప్ప అనుభూతి పంచింది అనడంలో సందేహం లేదు. అలాగే భైరవగా ప్రభాస్ పాత్రను నాగ్ అశ్విన్ వినూత్నంగా రూపొందించాడు. భైరవ పాత్రకు నెగిటివ్ షేడ్స్ ఆపాదించాడు. అమితాబ్ పోషించిన అశ్వద్ధామ రోల్ సినిమాకు హైలెట్. భైరవ-అశ్వద్ధామ కాంబోలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ గూస్బంప్స్ రేపుతాయి. 

actor jagapathi babu celebrates kalki 2829 ad success with vodka cheers to prabhas ksr

దీపికా పదుకొనె, కమల్ హాసన్ కల్కి చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలు చేశారు. శోభన, రాజేంద్ర ప్రసాద్, పశుపతి కీలక రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా కల్కి సక్సెస్ ని నటుడు జగపతిబాబు సెలబ్రేట్ చేసుకున్నాడు. మందేస్తూ ప్రభాస్ కి, అలాగే కల్కి చిత్ర యూనిట్ కి చీర్స్ చెప్పాడు. జగపతిబాబుకు చాలా వ్యసనాలు ఉన్నాయి. ముఖ్యంగా డ్రింక్ చేస్తూ ఆయన పలుమార్లు ఫోటోలు, వీడియోలు తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేశాడు. 

ఈసారి ఆయన వోడ్కా లో డిఫరెంట్ ఫ్లేవర్స్ మిక్స్ చేసి ఆస్వాదించాడు. ప్రొఫెషనల్ బార్ టెండర్స్ ని తలదేన్నేలా పెగ్ కలిపాడు. కల్కి సక్సెస్ అయినందుకు ప్రభాస్ కి చీర్స్ అని సదరు వీడియోలో కామెంట్ జోడించాడు. జగపతిబాబుకు జూదం కూడా ఒక వ్యసనం. ఒక దశలో చేతిలో సినిమాలు లేక, డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. లెజెండ్ మూవీ ఆయనకు తిరిగి లైఫ్ ఇచ్చింది. 

actor jagapathi babu celebrates kalki 2829 ad success with vodka cheers to prabhas ksr

విలన్ గా సక్సెస్ అయిన జగపతిబాబు ప్రస్తుతం విలక్షణ పాత్రలు చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నారు. జగపతిబాబు చాలా బ్రాడ్ మైండెడ్. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు కాగా... పెద్దమ్మాయి విదేశీ కుర్రాడిని ప్రేమించింది. అతనికిచ్చి వివాహం చేశాడు. రెండో అమ్మాయికి కూడా నీకు నచ్చిన వాడిని వెతుక్కో, నేను పెళ్లి చేయను అని చెప్పేశాడట. ఈ విషయం ఓ ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios