Asianet News TeluguAsianet News Telugu

లోకేష్ కనకరాజ్ చిత్రంలో ఛాన్స్ అంటూ బిగ్ చీటింగ్.. నటుడు బ్రహ్మాజీ కామెంట్స్, హెచ్చరిక

చిత్ర పరిశ్రమలో వేధింపులు, మోసాలు గురించి వింటూనే ఉంటాం. తాజాగా సీనియర్ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ చిత్ర పరిశ్రమలో జరుగుతున్న ఓ మోసం గురించి వర్ధమాన నటీనటుల్ని హెచ్చరించారు.

Actor brahmaji comments on cheating in the name of Lokesh Kanagaraj dtr
Author
First Published Oct 5, 2023, 9:28 PM IST

చిత్ర పరిశ్రమలో వేధింపులు, మోసాలు గురించి వింటూనే ఉంటాం. తాజాగా సీనియర్ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ చిత్ర పరిశ్రమలో జరుగుతున్న ఓ మోసం గురించి వర్ధమాన నటీనటుల్ని హెచ్చరించారు. ఖైదీ, విక్రమ్ చిత్రాలతో సౌత్ లో క్రేజీ దర్శకుడిగా మారిన లోకేష్ కనకరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

స్టార్ హీరోలందరికీ అతడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారాడు. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో అతడు తెరకెక్కించే చిత్రాలు ఆడియన్స్ ఆసక్తిని పెంచేస్తున్నాయి. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దళపతి విజయ్ తో లియో చిత్రం తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. 

అయితే బ్రహ్మాజీ ట్వీట్ చేస్తూ.. లోకేష్ కనకరాజ్ చిత్రంలో అవకాశం ఇప్పిస్తానని చెబుతూ భారీ మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడు. అతడి వివరాలని బ్రహ్మాజీ బయట పెట్టారు. నటరాజ్ అన్నాదురై అనే వ్యక్తి తాను లోకేష్ కనకరాజ్ మ్యానేజర్ ని అని చెబుతూ సినిమా అవకాశాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు తమిళ చిత్రాలు పరిశ్రమ మిత్రుల ద్వారా తెలిసింది అని తెలిపాడు. 

 

లోకేష్ కనకరాజ్ చిత్రంలో మీకు ఛాన్స్ ఫిక్స్ అయింది అని కాస్ట్యూమ్స్ కోసం డబ్బులు ఇవ్వాలని చిత్రం పూర్తయ్యాక ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు అంటూ మోసం చేస్తున్నట్లు బ్రహ్మాజీ తెలిపాడు. 78268 63455 అతడి ఫోన్ నంబర్ ఇదే. ఈ నంబర్ నుంచి కాల్ వస్తే అప్రమత్తంగా ఉండండి అని బ్రహ్మాజీ పేర్కొన్నాడు. సత్యదేవ్ అనే మరో వ్యక్తి ఫోర్బ్స్ ఇండియా జర్నలిస్ట్ అని చెప్పి నటీనటుల్ని మోసం చేస్తున్నట్లు కూడా బ్రహ్మాజీ పేర్కొన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios