బండ్ల గణేష్ తాజాగా ట్వీట్ చర్చకు దారి తీసింది. ఆయన పరోక్షంగా డైరెక్టర్ త్రివిక్రమ్ ని టార్గెట్ చేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఫిలాసఫర్ లా మారిపోయారు. జీవితసారం వల్లిస్తూ ప్రతిరోజూ ట్వీట్స్ వేస్తున్నారు.అలాగే పవన్ కళ్యాణ్ భక్తుడిగా చెప్పుకుంటూ బండ్ల గణేష్ ఆయన్ని కూడా టార్గెట్ చేస్తున్నాడనే వాదన వినిపిస్తోంది. అప్పుడప్పుడు బండ్ల ట్వీట్స్ పవన్ ని పరోక్షంగా విమర్శిస్తున్నట్లు ఉంటున్నాయి. దాంతో పవన్ ఫ్యాన్స్ ఆయన మీద గుర్రుగా ఉన్నారు. ఇవ్వన్నీ అనవసరం నిజంగా నువ్వు పవన్ కళ్యాణ్ అభిమానివైతే... జనసేన పార్టీలో చేరి, ప్రచారం చెయ్. పార్టీకి మద్దతుగా నిలబడు. ఈ సొల్లు ట్వీట్స్ వద్దంటూ ఎద్దేవా చేస్తున్నారు. 

మరోవైపు త్రివిక్రమ్ మీద బండ్ల గణేష్ కి అసహనం ఉందన్న వాదన ఉంది. గతంలో ఒకసారి ఆయన్ని తిట్టాడు కూడా. త్రివిక్రమ్ మీద బండ్ల గణేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన కాల్ రికార్డు లీకైంది. ఆ వాయిస్ నాది కాదని బండ్ల వివరణ ఇచ్చారు. కొద్దిరోజుల తర్వాత ఆ ఆడియోలో ఉంది నా వాయిస్సే. ఏదో కోపంలో ఒక మాటన్నాను. తర్వాత కలిసి క్షమాపణ చెప్పాను. మేటర్ సెటిల్ అయిందన్నారు. 

అయితే తాజాగా మరోసారి త్రివిక్రమ్ ని బండ్ల గణేష్ టార్గెట్ చేశాడని సోషల్ మీడియా టాక్. బండ్ల గణేష్ లేటెస్ట్ ట్వీట్ పరోక్షంగా త్రివిక్రమ్ గురించే అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు నెటిజెన్స్... గురువు, మేధావి పదాలు త్రివిక్రమ్ ని ఉద్దేశించేనన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు . బండ్ల గణేష్ తన ట్వీట్లో 'మోసం చేయాలనుకునే వాడు మేధావిలా నటిస్తాడు.. వంచించాలనుకునేవాడు గురువులా నటిస్తాడు.. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు భక్తుడు గానే పొగరుగా ఉంటాడు.అది మీకు నచ్చినా నచ్చకపోయినా..' అని కామెంట్ చేశాడు. 

Scroll to load tweet…

మేధావిలా, గురువులా పవన్ దగ్గర త్రివిక్రమ్ నటిస్తున్నాడని, బండ్ల వంటి అసలైన భక్తుడు మాత్రం పొగరుగా ఉంటాడని. అది పవన్ కి నచ్చకపోయినా పర్లేదు.. అని చెప్పినట్టు ఉంది. ఈ ట్వీట్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. చెప్పేదేదో సూటిగా చెప్పు. డొంకతిరుగు వ్యవహారం వద్దంటున్నారు. 

పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ ని దూరం పెట్టాడన్నది ఒప్పుకోవాల్సిన నిజం. సందర్భం ఉన్నా లేకున్నా తరచుగా పవన్ కళ్యాణ్ ని కలిసి బండ్ల ఆశీర్వాదం తీసుకునేవాడు. త్రివిక్రమ్ ని తిట్టినప్పటి నుండి వీరిద్దరూ కలవలేదు. పవన్ తనకు దూరం కావడానికి త్రివిక్రమే కారణమని బండ్ల గణేష్ నమ్ముతున్నాడని తెలుస్తుంది. ఆ కోపం, అసహనం ఇలా ట్వీట్స్ ద్వారా తీర్చుకుంటున్నాడని నెటిజన్స్ అభిప్రాయం.