నటుడు బాలాదిత్య  నటి సుహాసిని పెళ్లి చేసుకుంటున్నట్టు ఇటీవల వార్తలు వినిపించాయి. సోషల్‌ మీడియాలో ఈ వార్తలు వైరల్‌ కావడంతో బాలాదిత్య మ్యారేజ్‌ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పుడిది చర్చనీయాంశంగా మారడంతో తాజాగా దీనిపై స్పందించాడు బాలాదిత్య. ఇందులో వాస్తవం లేదన్నారు. తామిద్దరం మంచి స్నేహితులమన్నాడు. 

ఆయన మాట్లాడుతూ, సుహాసిని, తాను మంచి స్నేహితులం. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామనే వార్తల్లో నిజం లేదు. ఎప్పుడైనా ఫంక్షన్లకి వెళ్లినప్పుడు ఇద్దరం ఒకే కారులో వెళ్లేవాళ్లం. అది చూసి కొందరు తప్పుగా అనుకున్నారు. మా మధ్య మంచి స్నేహం మాత్రమే ఉంది. మేం రెండు సినిమాల్లో కలిసి నటించే సరికి పెల్లి చేసుకుంటున్నామని వార్తలు రాశారు. కానీ మాకు అలాంటి అభిప్రాయం లేదు` అని తెలిపాడు. 

బాలాదిత్య చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. `ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం` చిత్రంతో బాలనటుడిగా తెరంగేట్రం చేశాడు. `లిటిల్‌ సోల్జర్స్`‌, `జంబలకిడిపంబ`,` హిట్లర్`‌, `అబ్బాయిగారు`, `బంగారు బుల్లోడు`, `హలో బ్రదర్`‌, `సమరసింహా రెడ్డి` వంటి పలు చిత్రాల్లో నటనతో ఆకట్టుకున్న అతడు `చంటిగాడు` సినిమాతో హీరోగా మారాడు. ఆయన నటించిన `అన్నపూర్ణమ్మ గారి మనవడు` ఇటీవలే రిలీజై మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం అతడు సినిమాలతో పాటు సీరియళ్లలోనూ నటిస్తూ బుల్లితెర మీద కూడా సందడి చేస్తున్నాడు. ఇదిలా ఇప్పటికే బాలాదిత్యకి మనసతో వివాహం జరిగింది. ఆయనకు ఓ కూతురు కూడా ఉంది.