Asianet News TeluguAsianet News Telugu

ప్రముఖ విలన్ ఆశిష్ విద్యార్థి రెండో వివాహం.. 60 ఏళ్ళ వయసులో ప్రేయసిని పెళ్లాడిన నటుడు

ప్రముఖ విలన్ ఆశిష్ విద్యార్థి ఏకంగా 60 ఏళ్ల వయసులో పెద్ద షాకే ఇచ్చారు. షష్టి పూర్తి వయసులో రెండో వివాహం చేసుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచారు.

Actor Ashish Vidyarthi second marriage with rupali dtr
Author
First Published May 25, 2023, 6:54 PM IST

వయసుతో సంబంధం లేని ప్రేమలు, పెళ్లిళ్లు ఇప్పుడు అంత ఆశ్చర్యం కలిగించడం లేదు. చిత్ర పరిశ్రమలో చాలా చోట్ల వయసుతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రేమలో సెలెబ్రిటీలు మునిగితేలుతున్నారు. అయితే ప్రముఖ విలన్ ఆశిష్ విద్యార్థి ఏకంగా 60 ఏళ్ల వయసులో పెద్ద షాకే ఇచ్చారు. 

షష్టి పూర్తి వయసులో రెండో వివాహం చేసుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచారు. ఆశిష్ విద్యార్థి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటుడిగా ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. తెలుగులో ఆశిష్ విద్యార్థి గుడుంబా శంకర్, పోకిరి, అదుర్స్, చిరుత, అలా మొదలయింది, నాయక్ లాంటి చిత్రాలతో గుర్తింపు పొందారు. 

ఆశిష్ విద్యార్థి చివరగా రైటర్ పద్మభూషణ్ చిత్రంలో సుహాస్ కి తండ్రిగా నటించారు. తాజాగా ఆశిష్ విద్యార్థి రూపాలి అనే ఫ్యాషన్ ఎంట్రప్రెన్యూర్ ని వివాహం చేసుకున్నారు. గతంలో ఆశిష్ విద్యార్థికి రాజోషి బారాతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు సంతానం కూడా. అయితే విభేదాల కారణంగా ఆశిష్ విద్యార్థి ఆమెతో విడిపోయారు.

Actor Ashish Vidyarthi second marriage with rupali dtr 

కొంతకాలంగా ఆయన రూపాలితో ప్రేమలో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆమె గౌహతికి చెందిన మహిళా. ఆమెకి కోల్ కతా లో ఫ్యాషన్ స్టోర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆశిష్, రూపాలి అతికొద్ది మంది కుటుంబ సభ్యులు.. సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆశిష్, రూపాలు ఇద్దరూ సాంప్రదాయ వస్త్ర ధారణలో మెరిసిపోతున్నారు. ఈ రోజు సాయంత్రం వీరిద్దరూ స్నేహితులకు, ఫ్యామిలీ మెంబర్స్ కి చిన్న పార్టీ అరేంజ్ చేసినట్లు తెలుస్తోంది. 

Actor Ashish Vidyarthi second marriage with rupali dtr

ఈ వయసులో ఆశిష్ విద్యార్థి రెండవ వివాహం చేసుకోవడంపై అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు వీరిద్దరికి పరిచయం ఎలా ఏర్పడింది ? ఇంతకాలం రిలేషన్ లో ఉన్నారా అనే విషయాలు తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios