Asianet News TeluguAsianet News Telugu

నాని సినిమా కోసం అంత డిమాండ్ చేస్తున్నాడా..? ఎస్ జె సూర్య రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

నేచురల్ స్టార్ నానీ మూవీలో.. ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయబోతున్నాడు తమిళ దర్శకుడు, నటుడు, నిర్మాత ఎస్ జే సూర్య. అయితే ఈ పాత్రకుగాను ఆయన భారీగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆయన ఏంత డిమాండ్ చేశాడంటే..? 

Actor and Director S J Surya Remuneration For Nani Movie JMS
Author
First Published Oct 24, 2023, 7:37 PM IST


నేచురల్ స్టార్ నానీ మూవీలో.. ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయబోతున్నాడు తమిళ దర్శకుడు, నటుడు, నిర్మాత ఎస్ జే సూర్య. అయితే ఈ పాత్రకుగాను ఆయన భారీగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆయన ఏంత డిమాండ్ చేశాడంటే..? 

వరుస ప్రయోగాలతో  దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని.  ప్రస్తుతం  నాని హాయ్ నాన్న సినిమా  చేస్తున్నారు. ఈసినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు నేచురల్ స్టార్. దసరా తర్వాత ఆయన నటించిన హాయ్ నాన్న మూవీపై వరుస అప్ డేట్లు ఇవ్వనున్నారు. ఇక ఈమూవీని  డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈమూవీ అప్ డేట్లు నడుస్తుండగా.. మరో సినిమాతో హడావిడి చేస్తున్నాడు నాని. 

ఈ మూవీ రిలీజ్ అయ్యే లోపు.. నాని  కొత్త సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అయ్యారు. అంటే సుందరానికి తర్వాత వివేక్ ఆత్రేయతో కాంబినేషన్ ను రిపీట్ చేస్తున్నాడు నేచురల్ స్టార్.  ఇక ఈమూవీకి టైటిల్ ను కూడా రీసెంట్ గా అనౌన్స్ చేశారు. సరిపోదా శనివారం అనే టైటిల్ తో ఈమూవీ రూపొందబోతోంది. 

ఈ సినిమాలో  తమిళ స్టార్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్. జె సూర్య  ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ పాత్ర కోసం ఆయన తీసుకునే రేమ్యునిరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. వైరల్ న్యూస్ గా కూడా మారింది. ఈ పాత్ర కోసం ఆయనకు ఏకంగా ఎనిమిది కోట్లు ఇస్తున్నారని సమాచారం. ఒక క్యారెక్టర్ రోల్ కోసం ఈ స్థాయిలో పారితోషకం తీసుకోవడం ఆయనకి ఇదే తొలిసారి.

ఆర్ఆర్ఆర్ తర్వాత డివివి దానయ్య నిర్మిస్తున్న సినిమా కావడంతో.. ఆ విధంగా కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. నానీతో మరోసారి  ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. గ్యాంగ్ లీడర్ తర్వాత నానితో ఆమె నటించడం ఇది రెండోసారి. యూనిక్ యాక్షనర్ గా ఈ సినిమా ఉండబోతుంది. జేక్స్ బిజోయ్  ఈమూవీకి సంగీతం అందిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios