టాలీవుడ్ కుర్ర హీరో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన 'సమ్మోహనం' సినిమాలో హీరోయిన్ అదితిరావ్ మాజీ ప్రియుడిగా నటించిన అమిత్ పురోహిత్ మరణించారు. ఆయన మరణ వార్త ఇండస్ట్రీ వర్గాలను షాక్ కి గురి చేసింది.

ఆయన మృతి పట్ల 'సమ్మోహనం' యూనిట్ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. బుధవారం సాయంత్రం అమిత్ మరణించినట్లుగా ట్వీట్ చేసిన సుధీర్ బాబు ఓ మంచి యువనటుడ్ని  కోల్పోయాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

హీరోయిన్ అదితి రావ్ హైదరీ, దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి కూడా అమిత్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అయితే ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సివుంది. హిందీలో పంక్, ఆలాప్ వంటి చిత్రాల్లో అమిత్ నటించాడు.