Asianet News TeluguAsianet News Telugu

ఆలస్యం చేయకండి, అందరూ తీసుకోండి

నేడు తిరుపతిలో గల ఆసుపత్రి నందు ఆయన వాక్సిన్ తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. కరోనా వాక్సిన్ మొదటి డోసు తీసుకున్నానని చెప్పిన మోహన్ బాబు అందరూ బాధ్యతగా కరోనా వాక్సిన్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.  ఆలస్యం చేయకుండా కరోనా వాక్సిన్ తీసుకోవాలని హితవు పలికారు.  అలాగే వైద్యుల నిస్వార్ధపరమైన సేవకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

acotr mohan babu takes covid vaccine urges all to take ksr
Author
Hyderabad, First Published Mar 29, 2021, 8:52 PM IST


విలక్షణ నటుడు మోహన్ బాబు కోవిడ్ టీకా వేయించుకున్నారు. నేడు తిరుపతిలో గల ఆసుపత్రి నందు ఆయన వాక్సిన్ తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. కరోనా వాక్సిన్ మొదటి డోసు తీసుకున్నానని చెప్పిన మోహన్ బాబు అందరూ బాధ్యతగా కరోనా వాక్సిన్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.  ఆలస్యం చేయకుండా కరోనా వాక్సిన్ తీసుకోవాలని హితవు పలికారు.  అలాగే వైద్యుల నిస్వార్ధపరమైన సేవకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

 
కరోనా వైరస్ ప్రభావం మరలా వేగవంతం అయ్యింది. అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు విరివిగా నమోదు అవుతున్నాయి. దీనితో కరోనా వాక్సిన్ తీసుకోవడానికి పలువురు ప్రముఖులు ఆసక్తి చూపుతున్నారు. అలాగే కరోనా టీకా పట్ల ఉన్న అపోహలు తొలగిస్తూ, అందరూ వాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నారు.

 
కొద్దిరోజల క్రితం హీరో నాగార్జున కోవిడ్ టీకా తీసుకున్నారు. హైదరాబాద్ లో ఆయన కరోనా వాక్సిన్ తీసుకోవడం జరిగింది. కరోనా వైరస్ వికటించి కొందరు మరణించినట్లు వార్తలు రావడం జరిగింది. దీనితో చాలా మంది సామాన్యులు వాక్సిన్ తీసుకోవడానికి సంశయం వ్యక్తం చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios