మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 80, 90 దశకాల్లో చిరంజీవి నటించిన సినిమాలని గమనిస్తే బలమైన కథ, చిరంజీవి మాస్ యాక్టింగ్ తో ఉండేవి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 80, 90 దశకాల్లో చిరంజీవి నటించిన సినిమాలని గమనిస్తే బలమైన కథ, చిరంజీవి మాస్ యాక్టింగ్ తో ఉండేవి. ఇప్పుడు కొరటాల శివ చిరుని అదే విధంగా ప్రజెంట్ చేయబోతున్నాడు. ఆచార్య ట్రైలర్ లో చిరంజీవిని చూస్తుంటే వింటేజ్ మెగాస్టార్ గుర్తుకు వస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాంచరణ్ 'సిద్ద' పాత్రపై ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 28న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో భారీ ఎత్తున చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలకు రెడీ అవుతోంది.
తాజా సమాచారం మేరకు ఏప్రిల్ 23న ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఘనంగా ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నారట. తాజా సమాచారం మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకని విజయవాడలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో దేవాలయాలు, అమ్మవారి ప్రస్తావన ఉంది. కాబట్టి సెంటిమెంట్ పరంగా కలసి వచ్చే అవకాశం ఉందని ఉంటున్నారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న కనక దుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు ఈ చిత్రానికి ఉంటాయని భావిస్తున్నారు. అలాగే రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ అన్నింటికీ కీలకంగా మారింది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది.
