మెగా అభిమానులతో పాటు, తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న యాక్షన్ డ్రామా ‘ఆచార్య’Acharya. ఈ మల్టీస్టారర్ మూవీ ఏప్రిల్ చివర్లో రిలీజ్ కానుంది. అయితే, మేకర్స్ ఫ్యాన్స్ కోసం మాస్ ట్రీట్ ను రెడీ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi,రామ్ చరణ్ Ram Charan కాంబినేషన్ లో కొరటాల శివ డైరెక్ట్ చేసిన సినిమా ఆచార్య. రామ్ చరణ్ తో పాటు నిరంజన్ రెడ్డి కలిసి నిర్మించిన ఈసినిమాలో చిరుకు జతగా కాజల్ Kajal.. రామ్ చరణ్ జోడీగా పూజా హెగ్డే Pooja Hegde నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేయబోతున్నారు. దేవాలయ భూముల విషయంలో అవినీతికి పాల్పడుతున్న అక్రమార్కులు భరతం పట్టే నక్సలైట్లుగా ఈ సినిమాలో చిరంజీవి -రామ్ చరణ్ నటించారు. ఈ లుక్స్ లో చిరు,చరణ్ ను చూసిన మెగా ఫ్యాన్స్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

గతంలో రిలీజ్ అయిన టీజర్స్, పోస్టర్స్, మ్యూజిక్ ట్రాక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కరోనా పరిస్థితులు కారణంగా కాస్తా ఆలస్యంగా వస్తోంది. ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అయితే చిత్ర యూనిట్ ఇప్పటి నుంచే ‘ఆచార్య’ ప్రమోషన్స్ పై ఫోకస్ పెడుతున్నారు. అయితే ఉగాది సందర్భంగా మెగా అభిమానులకు క్రేజీ అప్డేట్ అందించారు. ఈ చిత్రం నుంచి మాస్ ట్రీట్ ను రెడీ చేశారు మేకర్స్.

అయితే అతి త్వరలో ఆచార్య ట్రైలర్ (Acharya Trailer) రానున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సమాచారం అందించారు. ఈ మేరకు కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ ప్రకటించింది. ‘కొత్త సంవత్సరాన్ని మెగా న్యూస్ తో ప్రారంభిద్దాం.. త్వరలో ఆచార్య ట్రైలర్ అనౌన్స్ మెంట్ రానుంది.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు’ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక ఈ ట్రైలర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ నుంచి ఆచార్య వైబ్స్ స్టార్ట్ కానున్నాయి. 

Scroll to load tweet…