‘ఆచార్య’ లో చిరు పాత్రకు ప్రేరణ ఆ వ్యక్తా?
రామ్చరణ్ ప్రత్యేక పాత్రలో (సిద్ధ) నటిస్తుండగా ఆయన సరసన పూజాహెగ్డే - నీలాంబరి అనే పాత్రలో కనిపిస్తోంది. దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతిపై పోరాటమే ప్రధాన కథాంశంగా చిత్రం తెరకెక్కుతోంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఆచార్య’ . అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా టీజర్,పాట ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’లో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. రామ్చరణ్ ప్రత్యేక పాత్రలో (సిద్ధ) నటిస్తుండగా ఆయన సరసన పూజాహెగ్డే - నీలాంబరి అనే పాత్రలో కనిపిస్తోంది. దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతిపై పోరాటమే ప్రధాన కథాంశంగా చిత్రం తెరకెక్కుతోంది.
ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సంభందించిన ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో చిరంజీవి పాత్ర ..వైజాగ్ నుంచి వెళ్లి సాయుధ పోరాటంలో పాల్గొన్న ఓ రెబల్ జీవితాన్ని బేస్ చేసుకుని రూపొందించారని తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి ఎవరు అనేది మాత్రం తెలియరాలేదు. నిజ జీవిత పాత్రను బేస్ చేసుకుని రాసుకున్న ఈ స్క్రిప్టు చాలా ఇంట్రస్టింగ్ గా సాగుతుందిట.
ఇక చిత్రాన్ని మే 14న విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థలు తొలుత భావించాయి. అయితే ఈ మధ్య కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అందుకే సినిమాని చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న విడుదల చేసే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జులై మధ్యలోనూ విడుదల చేస్తారనే మరో వార్త కూడా వినిపిస్తోంది. మొత్తం మీద సినిమా విడుదల గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ స్వరాలు సమకూరుస్తుండగా.. తిరు ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు. చిత్రంలో సోనూ సూద్, అజయ్, తనికెళ్ల భరణి, కిశోర్ తదితరులు నటిస్తున్నారు.