రామ్ పోతినేని హీరోగా వచ్చిన ‘ది వారియర్’ సినిమా అల్లు అర్జున్ చేయాల్సిన సినిమా అట. లింగు స్వామి తొలుత అల్లు అర్జున్‌కే వినిపించాడట ఈ స్టోరీ. అయితే, అల్లు అర్జున్ నో చెప్పడంతో, ఆ స్ర్కిప్టు రామ్ వద్దకు వచ్చిందట.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో రామ్. ఈ సినిమా తర్వాత చేసిన రెడ్ సినిమా ఆ స్దాయి విజయం సాధించలేకపోయింది. దీంతో తాను పక్కా మాస్ ... పెర్‌ఫెక్ట్ స్ట్రిప్ట్‌తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమయ్యానంటూ ది వారియర్ తో వచ్చాడు. రామ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ది వారియర్ సినిమా మొన్న శుక్ర వారం విడుదల అయ్యింది. మార్నింగ్ షో నుంచే ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ సినిమా విషయమై ట్రేడ్ లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
వాస్తవానికి ది వారియర్ సినిమా ను బన్నీ చేయాల్సిందనే రూమర్స్ షికార్లు చేస్తున్నాయి.కొన్నాళ్ల క్రితం అల్లు అర్జున్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుందనే వార్తలు వచ్చాయి. సినిమా లాంచింగ్ కూడా జరిగింది. కొన్నాళ్ల పాటు ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయి. తెలుగు మరియు తమిళంలో ఒకేసారి ఈ సినిమాను చేయాలని భావించారు. లింగు స్వామి బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ లతో బన్నీ వెనుకంజ వేశాడు. బన్నీ వెనుకంజ వేయడంతో లింగు స్వామి రామ్‌కి కథ చెప్పాడని, ఆ క్రమంలో రామ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కిందని తెలుస్తుంది. దాంతో ఇప్పుడు రామ్ కన్నా అల్లు అర్జున్ జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉందని అంటున్నారు. సిని పరిశ్రమలో నిలదొక్కాలంటే ముందు కథా జడ్జిమెంట్ కావాలి. ఆ తర్వాత దర్శకుడు చెప్పిన దాన్ని నమ్మి ముందుకు వెళ్లాలి.
ది వారియర్ సోమవారం, మంగళవారం కలెక్షన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. సోమవారం 75 లక్షలు కన్నా తక్కువ షేర్ వచ్చింది. చాలా చోట్ల షోలు వెయ్యటం లేదు. మంగళవారం 50 లక్షలు కూడా రాలేదంటున్నారు. ఎంత లేదన్నా 15 కోట్ల పైనే నిర్మాతకు పోతుందని చెప్తున్నారు. దీంతో అల్లు అర్జున్ ముందే ప్రాజెక్టు నుంచి తప్పుకుని తెలివైన నిర్ణయం తీసుకున్నాడంటున్నారు.
