టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటుంది. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఆమె ఎందరో చిన్నారులకు అండగా నిలుస్తోంది. ఈ ఫౌండేషన్ స్థాపించిన ఆరంభంలో ఓ పసికందు కాలేయానికి శస్త్రచికిత్స చేయించారు.

దీనికోసం సమంత, తన బృందంతో కలిసి రూ.15 లక్షలు సేకరించారు. కానీ ఆ పసికందు ఆపరేషన్ కి స్పందించక చనిపోయింది. ఈ విషయం తెలిసి సమంతా సెట్స్ లో కన్నీరుమున్నీరుగా విలపించారట. ఈ విషయాన్ని ఆ సంస్థలో వాలంటీర్ గా పని చేస్తోన్న శశాంక బినేష్ అనే యువతి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రత్యూష ఫౌండేషన్ హ్యాండిల్ చేసిన తొలి కేసు ఇప్పటికీ గుర్తుంది.

సనా అనే పసికందుకి కాలేయ మార్పిడి చేయించాం. దీనికోసం రూ.15 లక్షలు సేకరించాం. పాపకి శస్త్ర చికిత్స చేయించడానికి తల్లితండ్రులకి స్థోమత లేదు. వారిది ప్రేమ వివాహం కావడంతో ఇంట్లో వారు కూడా పట్టించుకోలేదు. సనాకి ఆపరేషన్ చేయిన్చినప్పటికీ చనిపోయింది.

ఈ ఘటన జరిగినప్పుడు సమంత 'రభస' సినిమా సెట్స్ లో ఉన్నారు. నేను జరిగిన విషయాన్ని ఆమెకి చెప్పడానికి ఫోన్ చేశాను. ఆరోజే సమంత పుట్టినరోజు. కానీ విషయం తెలిసి సమంత సెట్ లోనే ఏడ్చేశారు అంటూ చెప్పుకొచ్చింది.