కొద్దిరోజులుగా అమితాబ్ ఆరోగ్యం సరిగా లేదని వరుసగా కథనాలు రావడం జరిగింది. అనారోగ్యం బారిన పడిన అమితాబ్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని వార్తలు వెలువడ్డాయి. వరుస కథనాల నేపథ్యంలో అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్ స్పందించారు. మీడియా కథనాల్లో ఎటువంటి నిజం లేదని తెలియజేశారు. 

నాన్న గారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారనేది అవాస్తవం. మీడియా వాళ్ళు హాస్పిటల్ లో చూసిన వ్యక్తి బహుశా నాన్న గారికి డూప్ అయి ఉండవచ్చు అని సెటైర్ వేశారు. నిరాధారమైన వార్తలు రాస్తున్న మీడియా పై ఆయన ఫైర్ అయ్యారు. మీడియా కనీస బాధ్యత లేకుండా వార్తలు రాస్తున్నారని ఆయన ఆక్రోశం వ్యక్తం చేశారు. 

ఇలాంటి వార్తలు దేశవ్యాప్తంగా ఉన్న అమితాబ్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయని అభిషేక్ అన్నారు.కొద్ది నెలల క్రితం అమితాబ్ తో పాటు అభిషేక్, ఐశ్వర్య మరియు ఆరాధ్య కరోనా బారిన పడ్డారు. 77 ఏళ్ల అమితాబ్ కరోనాను ఎదిరించి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చారు.