ఒకరికి ఒకరు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన నార్త్ బ్యూటీ ఆరతీ చాబ్రియా సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకోవం బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ లో ఏన్నో సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆరతీ 2013 నుంచి నటనకు దూరంగా ఉంటోంది. ఆ మధ్య టివి షోలతో పలకరించిన ఈ బ్యూటీ క్రేజ్ తగ్గడంతో అవకాశాలు ఆశించినంతగా రాలేవు. 

ఇకపోతే ఆమె నిశ్చితార్ధానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మారిషస్‌కు చెందిన  టాక్స్ కన్సల్టెంట్‌ విశారద్ బీదాసెసీతో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. అయితే వేడుకకి సినీ పరిశ్రమలో ఆమె ఎవరిని పిలవలేదని టాక్. 

వేడుక ముగిసిన అనంతరం ఈ విషయాన్నీ ఆరతీ మీడియాకు తెలిపింది. ఇక తెలుగులో కూడా ఆమె చిన్న అవకాశాలను కూడా వదులుకోలేదు. ‘ఇంట్లో శ్రీమతి, వీధిలో కుమారి’, ‘గోపి.. గోడమీద పిల్లి’ వంటి సినిమాలు చేస్తూనే ఐటెమ్ సాంగ్స్ ద్వారా బాలీవుడ్ లో బాగా క్లిక్ అయ్యారు.

 

పసివయసులో బాక్స్ ఆఫీస్ హీరోలు.. చిన్నపుడు ఎంత ముద్దుగా ఉన్నారో

2000 - 2019: టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్ by year