బాలీవుడ్ సూపర్‌ స్టార్ ఆమిర్‌ ఖాన్‌ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యాడు. తన గురువు మృతికి సంబంధించిన వార్తను అభిమానులతో షేర్  చేసుకున్న ఆమిర్‌ ఓ సందేశాన్ని ఫోస్ట్ చేశాడు. ఆయనతో కలిసి గడిపిన 4 ఏళ్ల కాలాన్ని గుర్తు చేసుకున్నాడు ఆమిర్‌. `నా మరాఠి గురువు సుహాస్‌ లియామే నిన్న మృతి చెందినట్టుగా తెలిసింది. సర్‌, మీరు నాకు విద్యా నేర్పిన అత్యుత్తమ గురువుల్లో ఒకరు. మీతో గడిపిన సమయాన్ని నేను ఎంతో ఎంజాయ్ చేశాను.

మీ క్యూరియాసిటి, ఏదైనా తెలుసుకోవాటి నేర్చుకోవాలి అని మీరు పడే తాపత్రేయం మిమ్మల్ని అద్భుతమైన ఉపాధ్యాయుడ్ని చేసింది. మీతో గడిపిన 4 సంవత్సరాల కాలం ఎప్పటికీ గుర్తుంటుంది. మీరు నాకు కేవలం మరాఠి నేర్పించటమే కాదు. మరెన్నో గొప్ప విషయాలను కూడా నేర్పించారు. మీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను` అంటూ ట్వీట్ చేశాడు ఆమిర్‌.

ఇక సినిమాల విషయానికి వస్తే 2018లో రిలీజ్‌ అయిన థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్ సినిమా తరువాత లాంగ్ గ్యాప్‌ తీసుకున్న ఆమిర్‌ ఖాన్‌ ప్రస్తుతం లాల్‌ సింగ్‌ చద్దా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను 1994లో రిలీజ్ అయిన అమెరికన్‌ డ్రామా ఫారెస్ట్ గంప్‌ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమిర్‌కు జోడిగా కరీనా కపూర్‌ నటిస్తోంది.