Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ కోసం అమీర్ నిర్ణయం మార్చుకున్నారా?

మొదట ఆ పాత్రకు సంజయ్ దత్ ని అనుకున్నా ఇప్పుడు అమీర్ ఖాన్ ని సీన్ లోకి తెచ్చాడంటున్నారు.  ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది. 

Aamir for the role opposite to Junior NTR?
Author
First Published Jan 1, 2023, 10:34 AM IST


బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పేరొందిన ఆమిర్ ఖాన్ ఆ మధ్యన  సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సినిమాలకు బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. తన చిన్ననాటి స్నేహితులు నిర్వహించిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ హీరో.. ఈ సందర్భంగానే ఆ విషయాన్ని వెల్లడించాడు. తన 35 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో తాను తొలిసారి ఇలా బ్రేక్ తీసుకోబోతున్నానని తెలిపాడు.

 ‘‘నేను ఒక సినిమా చేస్తున్నప్పుడు, పూర్తిగా అందులోనే లీనమైపోతాను. జీవితంలో మరే విషయాలు లేవన్నట్లుగా ధ్యాస మొత్తం ఆ సినిమాపైనే పెడతాను. నిజానికి నేను లాల్ సింగ్ చడ్ఢా తర్వాత ‘ఛాంపియన్స్’ సినిమా చేయాలి. అదో అద్భుతమైన స్క్రిప్ట్. కానీ.. ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలనిపిస్తోంది. అమ్మ, పిల్లలు, నా కుటుంబంతో సమయం గడపాలనుంది’’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడా నిర్ణయం మార్చుకున్నట్లు చెప్తున్నారు. 

మీడియాలో వస్తున్న వార్తల్లో కి వెళ్తే ..కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తాత్కాలికంగా ఎన్టీఆర్‌31 అని పేరు పెట్టారు. అయితే తాజాగా మరో వార్త  మీడియాలో వినపడుతోంది. ఎన్టీఆర్, ప్రశాంత్‌ నీల్‌ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అమీర్‌ ఖాన్‌ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కు విలన్ గా అమీర్ ని తీసుకోవాలని చూస్తున్నట్లు చెప్తున్నారు. మొదట ఆ పాత్రకు సంజయ్ దత్ ని అనుకున్నా ఇప్పుడు అమీర్ ఖాన్ ని సీన్ లోకి తెచ్చాడంటున్నారు.  ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
 
మరో ప్రక్క కేజీఎఫ్ నిర్మాత మాట్లాడుతూ.. 'ఈ సినిమా గురించి చాలా ఎగ్జైట్‌గా ఉన్నా. దయచేసి ఆ సినిమా జోనర్ గురించి నన్నేమీ అడగొద్దు. ఎందుకంటే దానికి ఇంకా చాలా టైం ఉంది. గత 20 సంవత్సరాలుగా ఎన్టీఆర్‌కు అభిమానిని. మేము స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించే ముందు 10 నుంచి 15 సార్లు  కలుసుకున్నాం. అతన్ని కొంచెం ఎక్కువ అర్థం చేసుకోవాలనుకున్నా. నటీనటులందరితో ఇది నా సాధారణ ప్రక్రియ.' అని అన్నారు.   
 
ఇంకా ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘నేను గత 35 సంవత్సరాల నుంచి సినిమాల్లో నటిస్తూనే ఉన్నాను. సింగిల్-మైండెడ్‌గా నా పని మీదే ఫోకస్ పెట్టాను. కానీ.. అది కరెక్ట్ కాదనిపిస్తోంది. నాకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో కలిసి సమయం గడిపేందుకు ఇదే సరైన సమయమని అనిపిస్తోంది. వారితో కలిసి జీవితాన్ని మరో యాంగిల్‌లో చూడొచ్చు. కాబట్టి మరో ఏడాదిన్నర వరకు నటుడిగా కెమెరా ముందుకు వెళ్లకుండా, విశ్రాంతి తీసుకోవాలని ఫిక్స్ అయ్యా’’ అని తెలిపాడు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios