Asianet News TeluguAsianet News Telugu

రాజమౌళి కొడుకు తప్పుకున్నాకే... అసలు కథ మొదలైంది!

ఏదైనా భారీ ఆఫర్ వచ్చిందా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఉన్న అంశం. ఈ చిన్న సినిమా ..రాజమౌళి కొడుకు చేతిలో ఉన్నంత సేపూ భారీగా బజ్ చేసింది. ఆ తర్వాత సైలెంట్ గా సెలెంట్ అయ్యిపోయింది. కానీ రీసెంట్ గా ఈ సినిమా గురించి వార్తలు మొదలయ్యాయి. 

Aakashavani  in talks with a OTT Major?
Author
Hyderabad, First Published Aug 17, 2020, 3:23 PM IST

ఇన్నాళ్లూ  సైలెంట్ గా ఉన్న'ఆకాశవాణి'   ప్రాజెక్టు ..హఠాత్తుగా హడావిడి చేయటానికి గల కారణం ఏమై ఉంటుంది., బిజినెస్ పరంగా ఏదైనా భారీ ఆఫర్ వచ్చిందా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఉన్న అంశం. ఈ చిన్న సినిమా ..రాజమౌళి కొడుకు చేతిలో ఉన్నంత సేపూ భారీగా బజ్ చేసింది. ఆ తర్వాత సైలెంట్ గా సెలెంట్ అయ్యిపోయింది. కానీ రీసెంట్ గా ఈ సినిమా గురించి వార్తలు మొదలయ్యాయి. అసలేం జరుగుతోంది అనే ఇన్ సైడ్ విషయం ఆరాతీస్తే ...

ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌.రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్‌. కార్తికేయ నిర్మాతగా షైనింగ్‌ బిజినెస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఆకాశవాణి  అనే సినిమాని ఆ మధ్యన మొదలెట్టారు. అయితే ఊహించని విధంగా  ఈ సినిమా నుండి రాజమౌళి కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ తప్పుకున్నట్లు, దర్శక నిర్మాతలతో ఆయనకు ఏర్పడిన అభిప్రాయ భేధాలే కారణమని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఎస్ ఎస్ కార్తికేయ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆ నోట్ లో ఆయన తాను తప్పుకోవటం నిజమే అని చెప్పారు. అందుకు కారణంగా ఆయన ఆకాశవాణి సినిమా దర్శకుడితో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ అని చెప్పారు. దాంతో ఈ సినిమా బిజినెస్ జరగటం ఒకింత కష్టమనే అందరికి అర్దమైంది. 

కానీ ఇప్పుడున్న ఓటీటి రిలీజ్ లలో దీన్ని రిలీజ్ చేస్తే బెస్ట్..అని దర్శక,నిర్మాతలు నిర్ణయానికి వచ్చారట. ఓటీటి అయితే బిజినెస్ సమస్యలు ఏమీ ఉండవని, తమ పరిచయాలతో ఓ ఓటిటి కంపెనీని ఓకే చేయించుకుంటే చాలని, త్వరగా మిగిలిన షూట్ ఫినిష్ చేసి, ఓటీటి వైపు ప్రయాణం పెట్టుకోవటం బెస్ట్ అని డిసైడ్ అయ్యారట. ఈ మేరకు పనులు స్పీడ్ చేస్తున్నారట.
ఇక ఆకాశవాణి సినిమాకు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తుండగా, ఏ. పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ  సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాలను  మినుములూరు ఏపీఎఫ్‌డీసీకి చెందిన కాఫీ తోటల్లో చిత్రీకరించారు. హీరో హీరోయిన్‌లు లేకుండా కేవలం ఇతర పాత్రలతో 1970 నాటి అంశాలను ప్రధానంగా తీసుకుని, పౌరణిక బాణిలో సినిమా ఉంటుందని యూనిట్‌ సభ్యులు తెలిపారు. దర్శకుడు రాజమౌళి వద్ద అసోసియెట్‌ డైరెక్టర్‌గా పని చేసిన అశ్విన్‌ గంగరాజు తొలిసారిగా ఆకాశవాణి చిత్రానికి దర్వకత్వం వహిస్తున్నారని తెలిపారు. జబర్దస్త్‌ నటుడు శేషు, తదితర కొత్తవారు మాత్రమే ఈ చిత్రంలో నటిస్తున్నారని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios