మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ `ఆదికేశవ`. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. అదిరిపోయేలా ఉంది.
వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ `ఆదికేశవ`. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ పతాకంపై రూపొందుతుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతుంది. సినిమా మరో మూడు రోజుల్లో(నవంబర్ 24న) విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ని విడుదల చేశారు. దాదాపు రెండు సార్లు ట్రైలర్ వాయిదా పడగా, తాజాగా సోమవారం సాయంత్రం `ఆదికేశవ` ట్రైలర్‌ని విడుదల చేశారు.
ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. అదే సమయంలో ట్రైలర్‌లో మొదటి భాగం హీరోయిన్ శ్రీలీలతో ఇంటెన్స్ లవ్ ట్రాక్‌తో సాగింది. ఆ తర్వాత పూర్తిగా మాస్ యాంగిల్ తీసుకుంది. ప్రత్యర్థులను ఎదుర్కొనే క్రమంలో వైష్ణవ్ తేజ్ ఊరమాస్‌గా మారిపోయాడు. తనదైన హీరోయిజంతో అదరగొట్టాడు. భారీ యాక్షన్, మాస్ డైలాగ్‌లతో ఆకట్టుకున్నాడు. తనలోని కొత్త యాంగిల్ చూపించారు. లవ్ స్టోరీతోపాటు యాక్షన్ ప్రధానంగా సినిమా సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అదే సమయంలో ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండటం విశేషం.

వైష్ణవ్ తేజ్.. `ఉప్పెన` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. తొలి చిత్రంతోనే వంద కోట్లు వసూలు చేసిన హీరోగా నిలిచారు. ఆ తర్వాత `కొండపొలం`, `రంగరంగ వైభవంగా` చిత్రాలతో వచ్చారు. కానీ ఈ రెండు సినిమాలు ఆడలేదు. దీంతో ఇప్పుడు యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ నయా లవ్ , ప్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం చేశారు. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించడం విశేషం. ఈ మూవీపై ఇప్పటి వరకు పెద్దగా బజ్ లేదు. తాజాగా ట్రైలర్ ఆ బజ్ తీసుకొస్తుందని చెప్పొచ్చు. అంచనాలు పెంచేలా ఈ ట్రైలర్ ఉంది. పైగా శ్రీలీల ఉండటంతో ఆ ఆసక్తి పెరిగింది. లవ్ ట్రాక్ సైతం క్రేజీగా ఉంది. మరి సినిమా ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి. ఆ నెల 24న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
