శర్వానంద్ అప్ కమింగ్ ఫిల్మ్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అయితే తాగాజా చిత్ర యూనిట్ ‘టైటిల్’సాంగ్ ను రిలీజ్ చేశారు. దేవీ శ్రీ ప్రసాదే గాత్రం అందించడంతో సాంగ్ ఆకట్టుకుంటోంది.
ఫామిలీ ఓరియేంటెడ్ మూవీస్ తో దూసుకు పోతున్నాడు టాలీవుడ్ హీరో శర్వానంద్. వరుస సినిమాలతో దూసుకుపోతూ తన అభిమానులను ఖుషీ చేస్తున్నారు. శర్వానంద్ నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా ఈ మూవీ నుంచి ఇటీవల మేకర్స్ విడుదల చేసిన టైటిల్ పోస్టర్లు, మోషన్ పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. నిన్న లిరికల్ సాంగ్ ప్రోమోన్ రిలీజ్ చేయగా, తాజాగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.
ప్రస్తుతం ఈ లిరికల్ వీడియో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ టైటిల్ సాంగ్ కు లిరిసిస్ట్ శ్రీ మణి ఆడవాళ్లను పొగుడుతూనే తిడుతూ మంచి లిరిక్స్ అందించారు. దేవీ శ్రీ ప్రసాద్ క్యాచీ ట్యూన్ అందించడంతో పాటు, తానే స్వయంగా గాత్రం కూడా అందించారు. దీంతో సాంగ్ మరింత వినసొంపుగా ఉంది. ‘హె లక్ష్మమ్మో.. పద్మమ్మో.. శాంతమ్మో.. శారదమ్మో.. గౌరమ్మో.. క్రిష్ణమ్మో.. నా బాధే వినవమ్మో.. ఈ గోలే ఏందమ్మో.. ఇగోలే వద్దమ్మో.. ఓ లమ్మో.. నాబతుకే బుగ్గయ్యేనమ్మో.. ఆడాళ్లు మీకు జోహార్లు.. ఆడాళ్లు మీకు జోహార్లు’ అంటూ శ్రీమణి రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఈ మూవీకి తిరుమల కిషోర్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుజిత్ సుధాకర్ చేరుకూరి నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ మూవీలో శర్వానంద్ కు జంటగా ఆల్ ఇండియా క్రష్ ‘రష్మిక మండన్న’ నటించింది. కాగా ఈ మూవీని ఫిబ్రవరి 25న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. మరోవైపు శర్వానంద్ మరో సినిమా ‘ఒకే ఒక జీవితం’ మూవీ కూడా ఈ నెలలోనే రిలీజ్ కానుంది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ‘అమ్మ’ లిరికల్ సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
