ఒక సినిమాపై కొంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తే ఎంతో కొంత వెనక్కి వస్తుంది. మినిమమ్ గ్యారెంటీ ఉన్న హీరో అని ఇంకొంత పెట్టుబడి పెడితే..ఆ డబ్బు వెనక్కి రావాలి. లేకుంటే సగమైనా రావాలి. అయితే రవితేజ కెరీర్ లో అమర్ అక్బర్ ఆంటోని  సినిమా ఊహించని స్థాయిలో నష్టాలను మిగిల్చింది. ఆ దర్శకుడికి - హీరోకు ఈ మధ్య వచ్చే అవకాశాలు కూడా గల్లంతయినట్లు టాక్ వస్తోంది. 

AAA సినిమా ఫైనల్ కలెక్షన్స్ లిస్ట్ రీసెంట్ గా బయటకు వచ్చింది. సినిమాకు 25 కోట్లకు పైగా నిర్మాతలు ఖర్చు చేయగా 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ 12.5 కోట్లని తెలుస్తోంది. షేర్స్ పరంగా 6 కోట్ల వరకు అందినట్లు సమాచారం. నవంబర్ 16న రిలీజైన ఈ సినిమా మొదటి షోకే డిజాస్టర్ టాక్ ను అందుకుంది. సినిమాకు చేసిన ప్రమోషన్స్ కూడా పెద్దగా ఉపయోగపడలేదు. 

రిలీజ్ అనంతరం చిత్ర యూనిట్ కూడా టాక్ కు బయపడి సైలెంట్ అయ్యింది. దర్శకుడు శ్రీను వైట్ల మరో కథతో ఇతర హీరోల దగ్గరికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. రవి తేజకు కూడా ఇంతకుముందు వెయిటింగ్ లిస్ట్ లో పెట్టిన ప్రాజెక్టులు కూడా ఏకధాటిగా క్యాన్సిల్ అయినట్లు రూమర్స్ వస్తున్నాయి.