Asianet News TeluguAsianet News Telugu

వీడియో: హీరో అజిత్ ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం, కారణం ఏంటంటే?

గత ఏడాది అజిత్ తన భార్య షాలినీతో పాటు ఓ ప్రైవేట్ హాస్పిటల్ ని సందర్శించడం జరిగింది. కాగా వాళ్ళ విజిట్ కి సంబంధించిన వీడియోలు, నర్స్ ఫర్జానా సోషల్ మీడియాలో విడుదల చేశారు.

a women tries to commit suicide in front of hero ajith kumar house
Author
Hyderabad, First Published Oct 6, 2021, 1:33 PM IST

అక్టోబర్ 4వ తేదీన సౌత్ ఇండియా సూపర్ స్టార్ అజిత్ ఇంటి ముందు హైడ్రామా చోటు చేసుకుంది. ఓ మహిళ నిరసన తెలుపుతూ, ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. పోలీసులు రంగ ప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఫర్జానా అనే మహిళ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నర్స్ గా పని చేసేవారు. ఆమె పనిచేస్తున్న హాస్పిటల్ ని గత ఏడాది అజిత్ తన భార్య షాలినీతో పాటు సందర్శించడం జరిగింది. కాగా వాళ్ళ విజిట్ కి సంబంధించిన వీడియోలు, నర్స్ ఫర్జానా సోషల్ మీడియాలో విడుదల చేశారు. 

దీనిని నేరంగా పరిగణిస్తూ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆమెను విధుల నుండి తొలగించడం జరిగింది. ఈ విషయంలో తనకు సహాయం చేయాలని, తిరిగి ఉద్యోగంలోకి తీసుకునేలా మేనేజ్మెంట్ కి సిఫారసు చేయాలని, అజిత్ దంపతులను ఫర్జానా కోరారు. అయితే Ajith kumar స్పందించకపోవడంతో ఆమెకు మేనేజ్మెంట్ తిరిగి ఉద్యోగం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో నిరసన తెలుపుతూ అజిత్ నివాసం ఎదుట ఒంటికి నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశారు ఫర్జానా. 

Also Read మొదటిసారి తమ లవ్ స్టోరీ బహిరంగంగా పంచుకున్న మహేష్, నమ్రత.. ఐదేళ్ల డేటింగ్ తరువాత పెళ్లి!


ఆత్మహత్యకు పాల్పడుతున్న ఫర్జానా ఒంటిపై నీరుపోసి స్థానికులు కాపాడారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను అదుపులోకి తీసుకొని, అక్కడ నుండి తరలించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడం జరిగింది. ప్రస్తుతం అజిత్ ఢిల్లీ వరకు బైక్ ట్రిప్ లో ఉన్నారు. ఆయన తాజ్ మహల్ ని సందర్శించినట్లు సమాచారం. 


మరోవైపు ఆయన లేటెస్ట్ మూవీ వలిమై షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో టాలీవుడ్ హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ చేస్తున్నారు. బోనికపూర్ నిర్మాతగా తెరకెక్కిన వలిమై 2022 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios