నేడు నందమూరి హీరో ఎన్టీఆర్ జన్మదినం కాగా... అభిమానులు, చిత్ర ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఎన్టీఆర్ ని ఉద్దేశించి చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ జన్మదినం నేడు. 1983 మే 20న జన్మించిన ఎన్టీఆర్ 41వ ఏట అడుగుపెట్టారు. ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకుని ఆయన అప్ కమింగ్ చిత్రాల నుండి అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చారు. దేవర నుండి ఫియర్ సాంగ్ వచ్చింది. అనిరుధ్ మ్యూజిక్ అందించిన ఫియర్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అలాగే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీపై అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందా... అనే సందేహాలు ఉండగా, మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
ఎన్టీఆర్ కి టాలీవుడ్ ప్రముఖులు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్.. ఎన్టీఆర్ కి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలియజేశారు. కొంచెం ఆలస్యంగా అయినా చిరంజీవి తనదైన శైలిలో ఎన్టీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ''కలలు అందరూ కంటారు. కొందరు మాత్రమే వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేస్తారు. ఎన్టీఆర్ పరిశ్రమలో నిత్య కృషీవలుడు. తారక్ నీకు జన్మదిన శుభాకాంక్షలు'' అని కామెంట్ పోస్ట్ చేశారు.
కాగా జన్మదిన వేడుకల కోసం ఎన్టీఆర్ సతీసమేతంగా విదేశాలకు వెళ్లారు. బర్త్ డే వేడుకలు ముగించుకుని వచ్చాక ఆయన తీరిక లేకుండా షూటింగ్స్ చేయాల్సి ఉంది. ఎన్టీఆర్ ఏక కాలంలో దేవర, వార్ 2 చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. దేవర దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 కొంత మేర చిత్రీకరణ జరుపుకుంది. అయాన్ ముఖర్జీ ఈ చిత్ర దర్శకుడు కావడం విశేషం.
