2020కి సంబంధించిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ను నిన్నప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తమిళ సూపర్ స్టార్ సూర్య (Suriya)కు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు, ఆయన ఫ్యాన్స్ కు అరుదైన గిప్ట్ దక్కింది.
తమిళ స్టార్ హీరో సూర్య - లేడీ డైరెక్టర్ సుధా కొంగర కాంబినేషన్ లో వచ్చిన తమిళ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘సూరారై పోట్రు’ (Soorarai Pottru). దక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జీఆర్ గోపినాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. 2020లో కరోనా ఆంక్షల నేపథ్యంలో నేరుగా ఓటీటీలోనే విడుదల అయ్యింది. ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సూరారై పోట్రు డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. మంచి వ్యూయర్ షిప్ ను దక్కించుకొని విమర్శకుల ప్రశంసలను అందుకుంది.
హీరో సూర్య అగ్రెసివ్ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్ లో ప్రేక్షకులను మాయ చేశారు. హీరోయిన్ అపర్ణ బాలమురళి చాలా సహజంగా నటించింది. నిన్న ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ - 2020కి (National Film Awards - 2020) సంబంధించి ఫీచర్డ్ మరియు నాన్ ఫీచర్డ్ ఫిల్మ్స్ లో తమిళ చిత్రం ‘సూరారై పోట్రు’కు ఏకంగా ఐదు అవార్డులు దక్కాయి. బెస్ట్ యాక్టర్ గా సూర్య, బెస్ట్ ఫిల్మ్ గా ‘సూరారై పోట్రు’, బెస్ట్ యాక్ట్రెస్ గా అపర్ణ బాలమురళీ, మ్యూజిక్ డైరెక్టర్ గా జీవీ ప్రకాష్, స్క్రీన్ ప్లేకిగాను సుధా కొంగర, షాలినీ ఉషాదేవి నేషనల్ అవార్డులు అందుకున్నారు. ఇదే చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, సూర్య కలిసి నటిస్తున్నారు. సుధా కొంగరనే దర్శకత్వం వహిస్తోంది.
అయితే 68వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2020కి సంబంధించిన ఉత్తమ నటుడిగా సూర్యకు అవార్డు దక్కడం ఆయన జీవితంలోనే ఓ అరుదైన గిఫ్ట్ ను అందించింది. ఆయన అభిమానులు కూడా ఇందుకు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. నిన్ననే జాతీయ అవార్డులు ప్రకటించగా.. ఈ రోజు సూర్య పుట్టిన రోజు కావడం విశేషం. సూర్య తాజాగా 47వ పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అవార్డు దక్కిన అందడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.
