Asianet News TeluguAsianet News Telugu

రామ్ చరణ్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న ఏఆర్ రెహమాన్ సెంటిమెంట్... ఒక్క హిట్టు లేదు బాబోయ్!


ఏ ఆర్ రెహమాన్ చాలా కాలం తర్వాత ఓ తెలుగు సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఆర్సీ 16 చిత్రానికి ఆయన పని చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే రామ్ చరణ్ ఫ్యాన్స్ ని భయపెడుతుంది. 
 

a r rehman flop sentiment fears ram charan fans ksr
Author
First Published Mar 21, 2024, 11:18 AM IST

సెంటిమెంట్స్ మూఢనమ్మకాలు మాత్రమే. అయితే ప్రతిసారి జరుగుతుంటే నమ్మాలి అనిపిస్తుంది. ఏ ఆర్ రెహమాన్ టాలీవుడ్ కి ఏనాడూ కలిసి రాలేదు. ఆయన మ్యూజిక్ ఇచ్చిన ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. ఈ సెంటిమెంట్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ని భయపెడుతుంది. 
ఏ ఆర్ రెహమాన్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. సంగీతంలో ఆయన చేసిన ప్రయోగాలు అద్భుతం. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే ఆ సినిమా సగం హిట్ అంటారు. ఎందుకంటే అంత గొప్ప సాంగ్స్ ఆయన ఇస్తారు. దశాబ్దాల పాటు ఏ ఆర్ రెహమాన్ తన మ్యూజిక్ తో అలరిస్తున్నాడు. రోజా మూవీతో మొదలైన ఆయన ప్రస్థానం కొనసాగుతుంది. 

ఆస్కార్ తో పాటు అనేక అంతర్జాతీయ గౌరవాలు ఏ ఆర్ రెహమాన్ అందుకున్నారు. కానీ తెలుగు సినిమాకు ఆయన అచ్చిరాలేదు. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఒక్క సినిమా కూడా ఆడలేదు. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన తెలుగు స్ట్రైట్ చిత్రాలు విఫలం అయ్యాయి. 1993లో విడుదలైన నిప్పురవ్వ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ బీజీఎం ఇచ్చారు. ఇది భారీ డిజాస్టర్ గా నిలిచింది. 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

వెంకటేష్ నటించిన సూపర్ పోలీస్, రాజశేఖర్ హీరోగా చేసిన గ్యాంగ్ మాస్టర్ చిత్రాలకు ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇచ్చారు. ఇవి రెండు ఆశించిన స్థాయిలో ఆడలేదు. మహేష్ బాబు హీరోగా దర్శకుడు ఎస్ జే సూర్య తెరకెక్కించిన నాని చిత్రానికి ఏ ఆ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. ఇది డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ భారీ బడ్జెట్ మూవీ కొమరం పులి చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇచ్చారు. ఇది కూడా డిజాస్టర్. 

కొమరం పులి తర్వాత ఏఆర్ రెహమాన్ మరో తెలుగు సినిమాకు పని చేయలేదు. ప్రస్తుతం ఆర్సీ 16కి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యారు. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. దీంతో ఏ ఆర్ రెహమాన్ బ్యాడ్ సెంటిమెంట్ ఫ్యాన్స్ ని భయపెడుతుంది. అయితే ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఏమాయ చేసావే సూపర్ హిట్. కాబట్టి ఈ సెంటిమెంట్స్ ని నమ్మాల్సిన అవసరం లేదు. కథ, కథనాలే చిత్ర విజయాన్ని డిసైడ్ చేస్తాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios