అది ఒక మసీదు, ముస్లింస్ భక్తితో ప్రార్థనలు చేసుకునే ప్రదేశం. ఈ ప్రాంతంలో ఒక హిందూ పెళ్ళి జరుగుతుంది. ఈ వీడియోను రెహమాన్ శేర్ చేశారు. ఇంతకీ అసలు సంగతేంటి.. మసీదులో హిందూ పెళ్లి జరుగడమేంటి..? 


ఏఆర్ రెహమాన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా.. రెండు ఆస్కారుల్లు సాధించిన
మ్యూజిషియన్ గా ఆయన రికార్డ్ అంత తేలికగా వచ్చింది కాదు. తాజాగా పొన్నియిన్ సెల్వన్ రెండు సినిమాలకు అద్బుతమైన మ్యూజిక్ ఇచ్చాడు రెహమాన్. అంతే కాదు ఈసినిమాలో ఓ పాటకు కాపీ రైట్ వివాదం కూడా ఫేస్ చేశాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. ఈక్రమంలో ఆయన తన సోషల్ మీడియా పేజ్ లో పుల్ యాక్టీవ్ గా ఉంటాడు. రకరకాల పోస్ట్ లతో నెటిజన్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా రెహమాన్ పోస్ట్ నెట్టింట్ చర్చకు దారి తీసింది. 

ఇంతకీ ఆయన పోస్ట్ చేసిన వీడియో ఏంటంటే..? హిందూ సాంప్రదాయ పద్దతిలో మసీద్‌లో జరిగిన ఒక పెళ్లి వీడియోని రెహమాన్ షేర్ చేశాడు. కేరళ అలప్పుజలోని చెరువల్లిలోని ఒక మహిళ తన కూతురు పెళ్లి చేయడానికి ఆర్ధికంగా ఇబ్బంది పడుతుంది. దీంతో తన కూతురు పెళ్లికి సహాయం చేయాలంటూ అక్కడ మసీద్‌ కమిటీని ఆశ్రయించింది. ఆమె పరిస్థితి అర్ధం చేసుకున్న మసీద్ పెద్దలు ఆమె కూతురు పెళ్లిని మసీద్ లోనే హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. మతసామరస్యాన్ని చాటిచెప్పే ఈ పెళ్ళి.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. 

Scroll to load tweet…

అంతే కాదు..ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ పేదింటి పిల్ల పెళ్ళికి.... పెళ్ళికూతురికి 10 సవర్ల బంగారం, 20 లక్షల క్యాష్ ని బహుమతిగా ఇచ్చారు. ఇక పెళ్లి వచ్చిన 1000 పైగా అతిథులకు కడుపునిండా వెజ్ అండ్ నాన్ వెజ్ విందు పెట్టి పంపించారు. దేశంలో చాలా చోట్ల.. మతాలపేరుతో.. కులాలపేరుతో కుమ్ములాటలు జరుగుతుంటాయి. ఆ హింసని ఆపేలా మెసేజ్ ఇవ్వాలనే మసీద్ పెద్దలు ఈ పెళ్లిని ఇంత ఘనంగా చేసినట్లు చెప్పుకొచ్చారు. 

ఇంత అద్భుతమైన.. గర్వించే వీడియోను రెహమాన్ ట్వీట్ చేశారు.. అంతే కాదు ఆయన ఏమన్నారంటే.. మీ మానవత్వానికి జోహార్లు. బేధాలు లేకుండా చేసిన మీ పని వ్యవస్థని మార్చేలా ఉంది అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ తో పాటు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రకరకాల కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.