ఏఆర్ రెహ్మాన్ ను వదలని వివాదాలు, మండిపడుతున్న బెంగాళీలు
పాపం ఏఆర్ రెహ్మాన్.. ఈమధ్య వివాదాల మధ్య నలిగిపోతున్నాడు. స్టార్ గా ఎదిగినన్నాళ్లు..పెద్దగా వివాదాలు లేవు రెహ్మాన్ ఖాతాలో. కాని ఈమధ్య ఎందుకో ఎక్కువగా వివాదాలువెతుక్కుంటూ వస్తున్నాయి.

ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ ఎందుకో ఆ మధ్య వివాదాల్లో బాగా చిక్కుకుంటున్నారు. వరుస వివాదాలు ఆయన్ను వెంటాడుతున్నాయి. ఎక్కువగా మాట్లాడటు రెహమాన్ అయినా సరే ఆయన్ను కాంట్రవర్సీలు వదలడంలేదు.ఇంతకు ముందు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కొంత మంది వ్యాఖ్యల వల్ల వివాదాలు వచ్చాయి. ఇక తాజాగా ఈసారి రెహమాన్ వల్ల కొన్ని వివాదాలు బయట పడుతున్నాయి.
రీసెంట్ గా చెన్నైలో నిర్వహించిన మ్యూజిక్ కన్సర్ట్ వివాదం అవ్వగా.. ఆ విషయంలో చాలా విమర్శలు ఎదుర్కున్నారు రెహ్మాన్. ఇక తాజాగా ఓ పాట విషయంలో ట్యూన్ మార్చారంటూ కొత్త చిక్కులు తెచ్చుకున్నారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. తాజాగా ప్రముఖ బెంగాలీ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం రచించిన స్వాతంత్ర్యోద్యమానికి సబంధించిన పాటను రెహమాన్ ట్యూన్ చేశారు. అయితే ఈ గీతం కరార్ ఓయ్ లౌహో కొపట్ ట్యూన్ మార్చేసారంటూ రెహ్మాన్ విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఈ పాట ట్యూన్‌ను రీసెంట్ గా విడుదలైన పిప్పా సినిమాలో రెహ్మాన్ వాడుకున్నారు.
ఈ పాట వాడుకునేందకు రెహమాన్ కు నజ్రుం కుటుంబ సభ్యులు అనుమతి ఇచ్చారు. కాని ఈ పాటకు సంబంధించిన దాని ట్యూన్ కంప్లీట్ గా మార్చేశారంటూ.. నజ్రుల్ మనవడు, మనవరాలు ఇతర కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.రెహ్మాన్ పాటను తొలగించాలని నజ్రుం కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పబ్లిక్ డొమైన్‌లో కూడా అందుబాటులో లేకుండా చర్యలు తీసుకోవాలని లేదంటే బెంగాలీ గాయకులు, కళాకారులతో నిరసనకు దిగుతామని వారు హెచ్చరించారు.
రెహ్మాన్ చేసిన పనికి బెంగాలీలు భగ్గుమంటున్నారు. రెహ్మాన్ ఇలాంటి పని చేస్తారని అనుకోలేదని.. అసలు ఇలాంటి పని చేస్తారని ఊహించ లేదని అంటున్నారు. ఈ విషయంలో.. బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా తీవ్ర విమర్షలు చేశారు. అటు బెంగాల్ ప్రజల నుంచి సోషల్ మీడియాలో సౌతం.. రెహ్మాన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.